విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుర్గమ్మ ఆలయంలో కరోనా కలకలం -అర్చకులకు సైతం : దర్శనాల్లో మార్పులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కరోనా తో పాటుగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ విస్తరిస్తుండటంతో విద్యా సంస్థల సెలవును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఏపీలోనూ విద్యా సంస్థల నిర్వహణ పైన ఈ రోజు లేదా రేపు నిర్ణయం తీసుకోనున్నారు. రెండో వేవ్ తరువాత తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న వేళ... ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ఏపీలో ఇప్పటికే ప్రభుత్వం కరోనా ఆంక్షలు ప్రకటించింది. రాత్రి పూట కర్ఫ్యను రేపటి నుంచి అమలు చేయనున్నారు. తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి కూడా ఈ కరోనా వైరస్‌ ప్రవేశించింది.

అర్చకుడికి కరోనా

అర్చకుడికి కరోనా

ఆలయ అర్చకులలో ఓ అర్చకుడికి కరోనా సోకింది. సదరు అర్చకుడికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇతర అర్చకుల కు సైతం కరోనా పరీక్షీలు నిర్వహించారు. అమ్మవారి దర్శనాల్లో కూడా మార్పులు చేశారు. అంతరాలయంలోకి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆలయంలో క్యూలైన్లను ఎప్పటికప్పుడూ శానిటైజ్‌ చేస్తున్నామని, భక్తులు కూడా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ ఆలయ ఈవో భ్రమరాంబ సూచించారు.

దర్శన వేళల్లో మార్పులు

దర్శన వేళల్లో మార్పులు


రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత దానికి అనుగుణంగా దర్శన వేళల్లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలో అందరూ పండుగ సంబరాల్లో ఉన్న సమయంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం కరోనా కేసులు ఏకంగా 4,955 నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 509 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22, 870 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇ

దేవాలయంలో శానిటైజేషన్

దేవాలయంలో శానిటైజేషన్


ఇక గడిచిన 24 గంటల్లో 397 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 64 , 331 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 35, 673 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 18 , 32, 010 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు వినియోగం తప్పని సరి చేసారు. మాస్కు లేకుంటే జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. రేపటి నుంచి సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కానుంది. టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు సాధించింది.

English summary
Covid tested positive for Durgamma temple staff in Vijayawda, Darshan timings changed and tests continue fo all the staff
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X