• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -‘ఎన్440కే కరోనా వేరింట్’పై నోటీసులు -సీఎం జగన్‌కు సిగ్గులేదంటూ

|

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి చుట్టూ రాజకీయాలు మరింత ముదిరాయి. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రతిపక్ష టీడీపీ విష ప్రచారాలు చేస్తోందన్న అధికార వైసీపీ ఈ మేరకు ప్రత్యర్థులపై చర్యలకు దిగింది. కరోనా వేరింట్ ఎన్440కే వ్యాప్తిపై అసత్య ప్రచారాలు చేశారంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏపీల ఎన్440కే వేరియంట్ పై తొలుత మాట్లడింది మంత్రులేనని, జాతీయ మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినా జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును టార్గెట్ చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?

చంద్రబాబు ఇంటికి పోలీసులు

చంద్రబాబు ఇంటికి పోలీసులు

కర్నూలు కేంద్రంగా ఎన్440కే కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందంటూ చంద్రబాబు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మాసుపోగు సుబ్బయ్య అనే వ్యక్తి కర్నూలు వన్ టౌన్ పీఎస్‌లో చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా టీడీపీ అధినేతపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతో పాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు నమోదు కావడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కర్నూలు వన్ టౌన్ పీఎస్ సీఐ కళ వెంకటరమణ ఆధ్వర్యంలోని బృందం ఆదివారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి చేరనుంది. సీఆర్‌పీసీ 41(ఏ) కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేయనున్నారు.

ఎన్440కే ప్రభావం లేకున్నా..

ఎన్440కే ప్రభావం లేకున్నా..

కరోనా కొత్త వేరియంట్‌పై చంద్రబాబుకు చేసిన ప్రకటనలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, వాటి ఆధారంగానే కేసు నమోదు చేయడం జరిగిందని కర్నూలు ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు. ఎన్‌440కే వేరియంట్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వదంతులు, అసత్య ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనీ ఆయన హెచ్చరించారు. నిజానికి ఎన్ 440కే (బి.1.36) వైరస్ వేరియంట్ ను గతేడాది గుర్తించారని, 2020 జున్‌, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పమని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. కాగా,

బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుబిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదు

  2-DG | How It Works On Human Cells And Fights Covid-19 || Oneindia Telugu
  కరోనా విలయంలోనూ జగన్ కక్షసాధింపు

  కరోనా విలయంలోనూ జగన్ కక్షసాధింపు

  ఎన్440కే వేరియంట్ వ్యాప్తిపై చంద్రబాబు మాట్లాడటానికి ముందే అనేక జాతీయ పత్రికలు, వెబ్ సైట్లలో ఆ వేరియంట్ ఏపీలోని కర్నూలు నుంచే పుట్టుకొచ్చిందని వార్తలు వచ్చాయని, దీనిపై తొలుత మంత్రి సీదరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారని, వాళ్లందరినీ వదిలేసి సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు కోసమే చంద్రబాబుపై కేసులు పెట్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  సెకండ్ వేవ్ పొంచి ఉందనీ తెలిసీ జగన్ సర్కారు నిర్ల‌క్ష్యం చేసింద‌ని, ఎన్‌440కే వైర‌స్ గురించి చంద్రబాబు అప్ర‌మ‌త్తం చేయ‌డం తప్పు కాకున్నా, జగన్ తన వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే చంద్ర‌బాబు, లోకేశ్‌పై కేసులు పెట్టించారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. చంద్రబాబుపై కేసు పెట్టిన సుబ్బయ్యకు జాతీయ మీడియా కథనాలు కనిపించలేదా? ఆ ఫిర్యాదు ఆధారంగా కేసులు పెట్టించడానికి జగన్ కు సిగ్గులేదా? అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా, మాజీ సీఎంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తే తప్పెలా అవుతుందని టీడీపీ ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు.

  English summary
  As FIR filed against TDP chief Chandrababu Naidu allegedly for creating panic among public over N440K strain in andhra pradesh, Kurnool police have served notices. a team of karnool police reaches to chandrababu house in hyderabad on sunday. chandrababu booked under sections 188 and 505(1)(b)(2) of the Indian Penal Code (IPC) and Section 54 of the Disaster Management Act. yanamala ramakrishnudu, pattabhi and other tdp leaders slams ap cm ys jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X