• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ఉప్పెనలా కరోనా- గంటకు 400- ప్రతీ నలుగురిలో ఒకరు-చెరిగిన పాత రికార్డు

|

ఏపీలో కరోనా కల్లోలం ఉప్పెనలా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య చూస్తుండగానే ఐదు వేల నుంచి దాదాపు పది వేలకు చేరిపోయింది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఈ కేసుల ఉధృతి త్వరలోనే రోజుకు 15వేలకు చేరినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. నిన్నటి హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం చూస్తే 24 గంటల్లో నమోదైన 9700 కొత్త కేసులు ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజల్లో సైతం ఆందోళన నింపేలా ఉన్నాయి. అటు మరణాలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయి, దీంతో పాత రికార్డులు కూడా అలవోకగా చెరిగిపోతున్నాయి.

 ఉప్పెనలా కరోనా వ్యాప్తి

ఉప్పెనలా కరోనా వ్యాప్తి

ఏపీలో ఉప్పెన గురించి పాత తరం ప్రజలకు తెలుసు. కానీ ఈ కరోనా ఉప్పెన గురించి తెలుసుకునేందుకు మాత్రం నేటి తరానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రస్తుతం ఏపీలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య దాదాపు పది వేలకు చేరువైంది. అయితే ఇది ఐదు వేల నుంచి పది వేలకు రావడానికి పట్టిన సమయం చూస్తే మాత్రం ప్రభుత్వమే కాదు ప్రతీ ఒక్కరూ వణికి పోవాల్సిందే. కేవలం వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఐదు వేల నుంచి కొత్త కేసుల సంఖ్య పది వేలకు చేరిపోయింది. ఇప్పుడు రోజు వారీ లెక్కలు వదిలేసి గంటకు ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయో చెప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చేసింది.

గంటకు 400 కొత్త కేసులు

గంటకు 400 కొత్త కేసులు

ఏపీలో తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం చూస్తే గంటకు 400కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్లు తేలింది. నిన్న మొన్నటి వరకూ ఈ కేసుల సంఖ్య 100 కూడా ఉండేది కాదు. అత్యంత తక్కువ సమయంలో కొత్త కేసుల వ్యాప్తి వాయు వేగాన్ని దాటిపోతోంది. గంటకు 400 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు వంటి జిల్లాలో పరిస్ధితి పూర్తిగా అదుపుతప్పుతున్నట్లు తెలుస్తోంది.

రికార్డు స్దాయికి పాజిటివిటీ రేటు

రికార్డు స్దాయికి పాజిటివిటీ రేటు

గతేడాది కరోనా సమయంలో మన రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల గరిష్ట పాజిటివిటీ రేటు 17.98 శాతం మాత్రమే. ఇప్పుడు తాజా ఉధృతిలో ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తాజాగా నిన్న కరోనా కేసుల పాజిటివిటీ రేటు 25 శాతానికి చేరిపోయింది. దీంతో డాక్టర్లకు సైతం ఊపిరాడని పరిస్దితి. గతేడాది సెప్టెంబర్ 4న ఏపీలో అత్యధికంగా 17.98 శాతం పాజిటివిటీ రేటుతో 10770 కేసులు నమోదయ్యాయి. నిన్న 25 శాతం పాజిటివిటీతో 9700 కేసులు నమోదయ్యాయి. అంటే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉండటం విశేషం.

మూడు జిల్లాల్లో భారీ కల్లోలం

మూడు జిల్లాల్లో భారీ కల్లోలం


రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నా మూడు జిల్లాల్లో మాత్రం పరిస్దితులు చేజారాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ నమోదవుతున్న కేసులే. నిన్న రాష్ట్రంలో 9700 కరోనా కేసులు నమోదైతే శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు జిలాల్లో కలిపి 3880 కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు సగం కేసులు ఇక్కడే నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా అయిన శ్రీకాకుళం 1444 కేసులతో టాప్‌లో ఉందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత గుంటూరులో 1200, చిత్తూరులో 1100 కేసులు వచ్చాయి.

 చేతులెత్తేసిన జగన్‌ సర్కార్

చేతులెత్తేసిన జగన్‌ సర్కార్


గతేడాది కరోనా వ్యాప్తి నియంత్రణలో వైసీపీ సర్కార్‌ మంచి పేరు తెచ్చుకుంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా భారీ ఎత్తున పరీక్షల నిర్వహణతో పాటు సేవల్లో నాణ్యతతో కేసుల్ని అరికట్టగలిగింది. కానీ ఇప్పుడు పరిస్దితి వేరు. ఓవైపు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా కేసుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తగా విఫలమవుతోంది. ఓవైపు పూర్తి స్దాయిలో పరీక్షలు చేయించే సామర్ధ్యం కానీ, వ్యాక్సిన్‌ వేయించే పరిస్ధితులు కానీ లేకపోవడంతో ఈ కేసుల్ని అడ్డుకోవడమెలాగో తెలియక అదికారులు తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా కలెక్టర్లను ఇందుకు బాధ్యుల్ని చేస్తూ వారిపై ఒత్తిడి పెంచుతోంది.

English summary
andhra pradesh seen almost 10k new daily covid 19 cases with 25 percent positivity rate which crosses previous year records also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X