• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాక్సిన్ల కొరతపై జగన్ షాకింగ్ కామెంట్స్ -‘కొవాగ్జిన్’ కుల ప్రస్తావన -అసెంబ్లీలో చంద్రబాబు, రామోజీపై నిప్పులు

|

కరోనా రెండో దశ విలయంలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతుండగా వైరస్ చుట్టూ నెలకొన్న రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరి కొద్ది నెలల్లోనే మూడో వేవ్ తప్పదని హెచ్చరికలున్నా ఇప్పటికీ వ్యాక్సిన్ల కొరత కలకలం పుట్టిస్తున్నది. వ్యాక్సిన్ల కొరతపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లోని అధికారి పార్టీలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. కొవిడ్ మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాక్సిన్ల పై రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తోన్న ప్రచారానికి కౌంటరిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు..

రఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లోరఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లో

సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్

సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల కొరత అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన విపక్ష టీడీపీపైన, దాని అనుకూల మీడియా సంస్థలపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఓ ఫార్మా కంపెనీ అధినేత, టీడీపీ చీఫ్, మీడియా టైకూన్ ల మధ్య కులం సంబంధాన్ని కూడా సీఎం పరోక్షంగా ప్రస్తావించారు. గడిచిన 14 నెల్లో కరోనాపై రూ.2,229 కోట్లు ఖర్చు చేశామని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జగన్ తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

వైఎస్సార్ మరణం, కరోనా విలయం -సీఎం జగన్ భావోద్వేగం -కొవిడ్ మృతులకు అసెంబ్లీ నివాళి -రూ.1000 కోట్లువైఎస్సార్ మరణం, కరోనా విలయం -సీఎం జగన్ భావోద్వేగం -కొవిడ్ మృతులకు అసెంబ్లీ నివాళి -రూ.1000 కోట్లు

వ్యాక్సిన్లపై వాస్తవాలివీ అంటూ..

వ్యాక్సిన్లపై వాస్తవాలివీ అంటూ..


‘‘ఇవాళ్టి అసెంబ్లీ ద్వారా వ్యాక్సినేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలను ప్రజలకు చెప్పదలచుకున్నాను. వ్యాక్సిన్ సంబంధిత అంశాలను కొందరు పదేపదే కావాలని వక్రీకరిస్తున్నారు. తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారు. మన దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారు. ఆ 26 కోట్ల మందికి రెండు డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ల కోసమే కావాలి. ఇక 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు రెండు డోసులు ఇవ్వాలంటే 120 కోట్ల డోసులు కావాలి. ఓవరాల్ గా 172 కోట్ల డోసులు మొత్తం దేశానికి అవసరం కాగా, ఇప్పటివరకు మన దగ్గర వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కేవలం 7 కోట్ల డోసులే. వీటిలో 6 కోట్ల డోసులు సీరమ్ సంస్థ, 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్నాయి.

ఏపీలో టీకాల పరిస్థితి..

ఏపీలో టీకాల పరిస్థితి..

దేశం మొత్తానికి 172 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటివరకు కేవలం 18 కోట్ల 44 లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేశారు. అదే ఏపీ విషయానికొస్తే, మన దగ్గర 45 ఏళ్లకు పైబడినవాళ్ల సంఖ్య 1.48 కోట్లు. వాళ్లందరికీ రెండు డోసులు అంటే 3 కోట్ల డోసులు కావాలి. 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ 4 కోట్ల డోసులు కావాలి. మొత్తమ్మీద రాష్ట్రానికి 7 కోట్ల డోసులు ఇవ్వాలి. కానీ కేంద్రం నుంచి మనకు దక్కినవి కేవలం 76 లక్షల 29 వేల 580 డోసులు మాత్రమే. వాస్తవాలు ఇలావుంటే..

వారి బంధువులదే భారత్ బయోటెక్..

వారి బంధువులదే భారత్ బయోటెక్..

వ్యాక్సిన్లపై వాస్తవ పరిస్థితులు తెలిసుండి కూడా కొందరు పనికట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ల ముసుగులో ఆరోపణలు చేసేవారందరికీ ఈ పరిస్థితులు తెలుసు. ఏపీలో వ్యాక్సిన్ల కొరతపై ఈనాడు పత్రిక, టీవీల్లో రామోజీరావు తెగ రాస్తుంటారు. మరి కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ యజమాని ఈ రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే. వాళ్లు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి కూడా బంధువులే. అలాంటప్పుడు వ్యాక్సిన్ల ఉత్తత్తి సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలుసు కదా అధ్యక్షా. అన్నీ తెలిసి కూడా వ్యాక్సిన్లు ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు పెట్టి వ్యాక్సిన్లు ఎందుకు కొనడంలేదు? కమీషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడంలేదని వాళ్లు అంటున్నారు. కొవిడ్ సమయంలో ఈ దుర్మార్గపు ఆరోపణలు, వక్రీకరణలు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. చివరిగా..

గ్లోబల్ టెండర్ల ద్వారా ఉచితంగా టీకాలు

గ్లోబల్ టెండర్ల ద్వారా ఉచితంగా టీకాలు


వ్యాక్సిన్ల కొరత ఉన్న మాట వాస్తవం. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న తక్షణ ప్రాధాన్యత వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లడమే. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన అతి తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. దేవుడి దయతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. అది కూడా ఉచితంగానే ఇస్తాం. వ్యాక్సినేషన్ ను 50 శాతానికన్నా తీసుకెళితేనే హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు మాస్కులు, భౌతికదూరం ఎలాగూ తప్పవు'' అని సీఎం జగన్ అన్నారు. అంతకు ముందు కరోనా పరిస్థితులపై జగన్ మాట్లాడుతూ, ప్రాణం విలువ తానకు బాగా తెలుసని, ప్రజల్ని కాపాడుకోడానికి శక్తికి మించి కృషి చేస్తానని అన్నారు. గురువారం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ లో కరోనాపై పోరు కోసమే ప్రత్యేకంగా రూ.1000 కోట్లు కేటాయించారు. కాగా, భారత్ బయోటెక్ అధినేత కృష్ణా ఎల్లాకు చంద్రబాబు, రామోజీరావుతో కుల సంబంధాలపై వైసీపీ మంత్రులు, నేతలు సైతం గతంలో విమర్శలు చేయడం తెలిసిందే.

English summary
amid covid vaccine shortage andhra pradesh chief minister ys jagan mohan reddy made sensational remarks on tdp chief chandrababu and media tycoon ramoji rao on assembly flore. while speaking on thanks giving motion to governor's speech on ap assembly budget session, cm jagan raised vaccines issues and slams chandrababu, ramoji rao naming bharat biotech owner. ap cm assures free vaccination, said, govt is going to global tenders for vaccines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X