విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కొట్టిన దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన సీపీఐ! జనసేనతో పొత్తుపై పునరాలోచన

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తనదైన శైలిలో పొత్తు పార్టీకి షాక్ ఇచ్చారు. అలాంటిలాంటి షాక్ కాదు. ఏకంగా పొత్తే వద్దనుకునేంత తీవ్రమైన షాక్ అది. పవన్ కొట్టిన దెబ్బకు సీపీఐ దిమ్మ తిరిగిపోయింది. కళ్లు బైర్లు కమ్మేశాయ్. పొత్తులో భాగంగా.. సీపీఐ నాయకులకు కేటాయించిన రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్.. తమ పార్టీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపారు. ఈ రెండు స్థానాల్లో కూడా సీపీఐకి గట్టి పట్టు ఉన్నవే. ఒకటి విజయవాడ లోక్ సభ, రెండోది నూజివీడు అసెంబ్లీ స్థానం.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్‌పాల్‌లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ <br>ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్‌పాల్‌లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ

వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం జనసేన పార్టీ బహుజన సమాజ్ వాది పార్టీతో పాటు సీపీఐ, సీపీఎంలతో సీట్లను సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ రెండు పార్టీలకు రెండు లోక్ సభ, ఏడు అసెంబ్లీ స్థానాలను కేటాయించారు పవన్ కల్యాణ్. అక్కడి దాకా బాగానే ఉంది. సీపీఐకి కేటాయించిన నియోజకవర్గాల్లో విజయవాడ లోక్ సభతో పాటు నూజివీడు అసెంబ్లీ స్థానం ఉంది.

CPI declared that no alliance with Jana Sena Party

సీపీఐ విజయవాడ లోక్ సభ అభ్యర్థి చలసాని అజయ్ కుమార్ నామినేషన్ వేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో హఠాత్తుగా బరిలో దిగారు పవన్. విజయవాడ, నూజివీడు స్థానాల నుంచి తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఆయన సీపీఐ నాయకులకు మాట మాత్రమైనా చెప్పలేదు. విజయవాడ లోక్ సభ జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్ బాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అలాగే నూజీవీడు అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబును ఆ పార్టీ ప్రకటించడంతో సీపీఐ మండిపడింది.

ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా పవన్ కల్యాణ్ తమ అభ్యర్థిని ప్రకటించారని సీసీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనితో హుటాహుటిన ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆదివారం విజయవాడలో సమావేశమయ్యారు. జనసేన పార్టీతో పొత్తు కొనసాగించాలా? లేదా? అనే అంశంపై చర్చిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడకు వచ్చిన పవన్ కల్యాణ్ వెంట సీపీఎం కార్యకర్తలు, నాయకులు ఉన్నారే తప్ప, సీపీఐ నేతలెవరూ కనిపించలేదు. దీనితో పొత్తు కొండెక్కిందనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

దీనితోపాటు- పొత్తులో భాగంగా తమకు విజయవాడ వెస్ట్ సీటును కేటాయించాలని సీపీఐ మొదట పవన్‌ను కోరింది. ఆ సీటు ఖాయం చేసుకోమని మొదట్లో సూచించిన పవన్ కల్యాణ్.. తరువాత తన వైఖరి మార్చుకున్నారు. చివరి నిమిషంలో విజయవాడ వెస్ట్ లో జనసేన అభ్యర్థిని నిలబెట్టారు. దీనితో.. ప్రత్యామ్నాయంగా నూజివీడు స్థానాన్ని సీపీఐ దక్కించుకుంది. అక్కడ తమ అభ్యర్థిగా అక్కినేని వనజను ప్రకటించింది కూడా. ఆ తర్వాత నూజివీడు స్థానాన్ని కూడా జనసేన వెనక్కి తీసుకుంది. తమ అభ్యర్థిని ప్రకటించింది. దీనితో బిత్తరపోయిన సీపీఐ నాయకులు.. పవన్ తో పొత్తుపై పునరాలోచన చేస్తున్నారు.

English summary
CPI Andhra Pradesh State leaders got shock from Jana Sena Party Chief Pawan Kalyan. Pawan announced his party candidate at Vijayawada Lok Sabha and Nuzvid Assembly segment, is allready allocate to CPI. After getting both seat CPI Candidate from Vijayawada Lok Sabha constituency Chalasani Ajay Kumar all set to submit his Nomination paper on Monday. Suddenly, Jana Sena Party announced candidate. In this connection, CPI rethinking their decision that to continue with Jana Sena Party or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X