విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వర్మకు ఏం తెలుసు, అరెస్ట్ చేయాలి': వంగవీటి రాధను కలవను: రామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కమ్యూనిస్ట్ నేత వెంకటరత్నంను రౌడీగా చిత్రీకరించాలని చూస్తే సహించమని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్కకు సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి శంకర్ హెచ్చరించారు. శనివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు.

పేదల కోసం తలసాని వెంకటరత్నం అనేక పోరాటాలు చేశారని చెప్పారు. బెజవాడలో కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర వర్మకు ఏం తెలుసునని నిలదీశారు. వర్మ తీస్తున్న వంగవీటి సినిమా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, రామ్ గోపాల్ వర్మ సందడి చేస్తున్నారు. దివంగత నేత వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా తాను తెరకెక్కిస్తున్న 'వంగవీటి' చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన విజయవాడ వచ్చారు.

ఆయన నిన్ననే వంగవీటి రంగా అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగాకు సంబంధించి పలు కీలక వివరాలను ఆయన వారి నుంచి సేకరించారు. శనివారం నాడు మాజీ ఎంపీ, తన స్నేహితుడు లగడపాటి రాజగోపాల్‌ను కలుస్తారు.

CPI Leader lashes out at Ram Gopal Varma

లగడపాటితో భేటీ ముగియగానే అక్కడి నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూని కలుస్తారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... వంగవీటి అనే ఇంటిపేరు ఒకరి సొంతం కాదన్నారు. తాజా చిత్రానికి 'వంగవీటి' అనే ఇంటిపేరు పెట్టిన విషయమై రంగా కుటుంబసభ్యులను సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

గతంలో నేను 'రక్తచరిత్ర' చిత్రం తీసినప్పుడు పరిటాల రవి కుటుంబసభ్యుల నుంచి పర్మిషన్ తీసుకోలేదని, కంపెనీ సినిమా తీసినప్పుడు దావూద్ ఇబ్రహీం, చోటాల పర్మిషన్ కూడా తీసుకోలేదనిచెప్పారు.

'వంగవీటి' చిత్రాన్ని తెరపైకెక్కించడం ద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశముందని, రెండు వర్గాల మధ్య మళ్లీ గొడవలు మొదలవుతాయనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఆ ఆలోచన చాలా స్టుపిడ్ అన్నారు. వంగవీటి సినిమా చూసిన వాళ్లకు నామీద కోపం రావడానికి ఆస్కారం ఉంటుందే తప్పా, మిస్ ఫైర్ అయ్యే ఆస్కారం లేదన్నారు. షూటింగ్ మొత్తం ముంబైలో ఉంటుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు వంగవీటి రత్నకుమారి నిరాకరించారని వర్మ చెప్పారు. తాను తీయనున్న 'వంగవీటి' చిత్రానికి సంబంధించి రంగా కుమారుడు రాధాకృష్ణను కలిసే ఉద్దేశం లేదన్నారు. ఈ సినిమాలో రాధాకృష్ణ పాత్ర లేదని, అందుకే ఆయన్ని కలవాల్సిన అవసరం లేదని చెప్పారు. దేవినేని పాయింట్‌మెంట్ తనకు లభించిందన్నారు.

English summary
Vijayawada CPI Leader lashes out at director Ram Gopal Varma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X