వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్...బఫూన్ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నా:సిపిఐ నారాయణ

|
Google Oneindia TeluguNews

కృష్ణా: గవర్నర్ నరసింహన్‌ను తాను విమర్శిస్తూ చేసిన బఫూన్ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అయితే రిపబ్లిక్‌ డే రోజు రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి వెళ్లేదిలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్‌ నరసింహన్ పై విమర్శల సందర్భంగా సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గవర్నర్ నరసింహన్ ను ఉద్దేశించి బఫూన్ గా అభివర్ణించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సిపిఐ నారాయణ తన వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గవర్నర్ ను ఉద్దేశించి తాను చేసిన బఫూన్ అనే పదాన్ని వెనక్కితీసుకుంటున్నానని నారాయణ చెప్పారు.

CPI leader Narayana withdrawl's his word "buffoon" against Governor.

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి బ్రోకర్‌లా పని చేస్తూ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారని నారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు గవర్నర్ భజన చేస్తున్నారని అన్నారు. అందుకే గణతంత్ర వేడుకల సందర్భంగా 'ఎట్‌ హోమ్‌' విందుకు ఆయన ఆహ్వానించినా తాను హాజరుకాబోనని ప్రకటించారు. గవర్నర్‌ వ్యవస్థ చెంచాగిరీకి తప్ప ఎందుకూ పనికి రాడని నారాయణ ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.

English summary
CPI leader Narayana withdrawl his controversial word "buffoon" against Governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X