అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వ్యక్తిగత లాభాల కోసమే ఇద్దరు సీఎంలు పాకులాట'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వ్యక్తిగత లాభాల కోసమే పాకులాడుతున్నారని అన్నారు.

ఇక, ఓటుకు నోటు వ్యవహారం సీఎం చంద్రబాబు రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

 cpi leader ramakrishna fires on telugu states chief ministers

టీటీడీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్

తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి సమావేసంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటు తిరుమలలో వకుళామాతా అతిథి గృహానికి రూ. 26 కోట్ల వ్యయంతో వసతి సదుపాయాన్ని నిర్మించాలని తీర్మానించింది. తానా ఆధ్వర్యంలో అమెరికాలో నాలుగు చోట్లు శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించేందుకు ఆమోద ముద్ర వేసింది.

చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద గోశాల నిర్మించాలని, తిరుమలలో ఎర్రచందనం మొక్కలు పెంచాలని నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో టీటీడీ భూమిలో 10 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రానికి ఆమోదం తెలిపింది.

రూ.22 లక్షలతో ఆరునెలలకు సరిపడా కొబ్బరికాయాలు కొనడానికి కూడా పాలక మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.

English summary
cpi leader ramakrishna fires on Andhra Pradesh and Telangana Cheif ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X