వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ .. ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్‌పై అటు టీడీపీ, జనసేనలతో పాటు సీపీఐ కూడా దాడికి దిగింది . ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ నేత రామకృష్ణ తప్పు పడుతున్నారు . కరోనా నియంత్రణా హర్యలపై ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇచ్చిన సీపీఐ నేత రామకృష్ణ సీఎం జగన్ విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

మాస్క్‌లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు . ఏపీలోని 14 యూనివర్సిటీల పాలకమండళ్ళ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ల నియామకాల్లో తీసుకోవలసిన ప్రమాణాలను తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు . కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని రామకృష్ణ పేర్కొన్నారు .

 CPI leader Ramakrishna outraged on cm jagan ..

ఇక సీఎం జగన్ ఎన్నికలు నిర్వాహించాలని పట్టు పట్టారని, ఆయన మాట విననందుకు ఎన్నికల కమీషనర్ రమేష్‌కుమార్‌పై జగన్‌ కక్షగట్టారని మండిపడ్డారు . కులం పేరుతో ఆయనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్‌కు కనిపించేది కాదని ఆయన మండిపడ్డారు . రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు . ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు . ప్రపంచమంతా కరోనా ఉంటే.. ఏపీలో జగన్‌ కొత్త వైరస్‌ కనిపెడుతున్నారు అని రామకృష్ణ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు .

English summary
CPI leader Ramakrishna said that employees are being suspended for questioning not having masks. He said that the appointments of the governing bodies of the 14 universities in AP had been manipulated and that the criteria for the appointment of Vice Chancellors of the University had been met. Ramakrishna claimed that Ramesh had taken a good decision by stopping the election when Corona was booming. Ramesh Kumar has been harassed by the Jagan faction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X