వారి వల్లే ఇదంతా; ఏపీలో వరదలు..అపార ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సీపీఐ రామకృష్ణ సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు అపార నష్టాన్ని కలిగించాయి. ప్రజల ఆస్తి నష్టం కాకుండా ప్రాణ నష్టం కూడా జరగడం ఏపీ వరదల తీవ్రతకు అద్దం పడుతుంది. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రజలకు సహాయం అందించటం కోసం ఇప్పటికే ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే, మానవ తప్పిదం వల్లే వరదలు ఇంతగా ముంచెత్తాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ వరదలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ రామకృష్ణ
ఇదిలా ఉంటే తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వరద ప్రభావిత ప్రాంతాలలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఎగువ మంద పల్లెలో తొమ్మిది మందిని కోల్పోయిన ఓ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ రామకృష్ణ ఏపీ వరదల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 గ్రామాలకు పైగా ముంపుకు గురి కావటానికి, 100 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇసుక మాఫియానే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య ఎర్త్ డ్యాం తెగిపోయిందని రామకృష్ణ పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం
వరదల
వల్ల
నష్టపోయిన
ప్రజానీకాన్ని
ప్రభుత్వం
తక్షణమే
ఆదుకోవాలని
డిమాండ్
చేసిన
ఆయన
తక్షణ
సహాయం
కింద
కుటుంబానికి
20
వేల
రూపాయల
చొప్పున
మంజూరు
చేయాలని
డిమాండ్
చేశారు.
చనిపోయిన
కుటుంబాలకు
25
లక్షల
పరిహారం
ఇవ్వాలని
తేల్చి
చెప్పారు.
వరదల్లో
ఇళ్లు
కోల్పోయిన
వారికి
ఇంటి
నిర్మాణానికి
ఐదు
లక్షల
రూపాయలు
మంజూరు
చేయాలని
సిపిఐ
రామకృష్ణ
రాష్ట్ర
ప్రభుత్వాన్ని
డిమాండ్
చేశారు.
ప్రభుత్వ
యంత్రాంగం
నిర్లక్ష్యం
వలనే
భారీగా
ఆస్తి
నష్టం,
ప్రాణ
నష్టం
సంభవించింది
అని
పేర్కొన్న
సీపీఐ
నేత
రామకృష్ణ,
దీనికి
ప్రభుత్వమే
నైతిక
బాధ్యత
వహించాలని
పేర్కొన్నారు.

అధికారుల సమన్వయ లోపం.. ప్రాణ నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత
గత 20 రోజులుగా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం కావాలని సమావేశాలు నిర్వహించింది కానీ విపత్తు ఎదురయ్యే సమయానికి అధికారుల సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించాయని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది, స్థానికుల వివరాల ప్రకారం వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని రామకృష్ణ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ప్రాంతాలలో వరదలు చోటుచేసుకోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రామకృష్ణ, ఈ ప్రాణ నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

మానవ తప్పిదం వల్లే వరదలు ముంచెత్తాయి
సుమారు 1500 పశువులు, 1000 గొర్రెలు, మేకలు, రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి అని ఆయన పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు తినడానికి తిండి లేక, నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం విచారకరమని పేర్కొన్న రామకృష్ణ పించ ప్రాజెక్టు తెగిపోతే అన్నమయ్య ప్రాజెక్టు తట్టుకోలేదని తెలిసికూడా అధికారులు అప్రమత్తం కాకపోవడం, శాశ్వత మరమ్మతులు చెయ్యకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా మానవ తప్పిదానికి వరదలు ముంచెత్తాయి అని పేర్కొన్న రామకృష్ణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.