వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఆ సలహా ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్‌కు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Abolish of AP Legislative Council: CPI Ramakrishna opposed YSRCP Government's Move | Oneindia Telugu

వైసీపీకి రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన, ఎన్నికల వ్యూహకర్త ,జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిషోర్‌ విషయంలో జరిగిన తాజా పరిణామాలు అందరికీ తెలిసినవే . జేడీయూ లో ఉండి కూడా సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించిన పీకే నితీష్ పై చేసిన పోరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక జగన్ కు కూడా కొన్ని సలహాలు ఇవ్వాలని రామకృష్ణ ప్రశాంత్ కిషోర్ కు బహిరంగ లేఖ రాశారు.

వ్యతిరేకిస్తే వ్యవస్థనే లేకుండా చేస్తారా ? సీఎం జగన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్వ్యతిరేకిస్తే వ్యవస్థనే లేకుండా చేస్తారా ? సీఎం జగన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

ఎన్‌పీఆర్‌, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు విషయంలో జేడీయూలో ఉంటూనే వాటికి మద్దతివ్వాలనే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అభినందనీయమన్నారు.స్వపక్షం అయినా తప్పు చేస్తే నిలదీసేలా ఉండాలని ఆయన ప్రశాంత్ కిషోర్ సాహసాన్ని అభినందించారు . అదే సమయంలో కేంద్రం తీసుకున్న నిరంకుశ నిర్ణయాలకు దాసోమంటున్న వైసీపీకి ఒక సలహాదారుడిగా మంచి సూచనలు చేయాలంటూ ప్రశాంత్‌ కిషోర్ కు లేఖ రాశారు.

CPI leader Ramakrishna writes open letter to Prashant Kishor to give some suggestions to Jagan

సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు దాసోహం అంటున్నారని, అలా కాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించండి అని ఆయన తన లేఖలో ప్రశాంత్ కిషోర్ ను కోరారు. ప్రశాంత్‌ కిషోర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన సీఎం జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు .

English summary
The latest developments in the case of Prashant Kishore, a political consultant to the YCP, and election strategist and JDU expatriate leader are well known. the CPI state secretary ramakrishna appriciated PK about his war on CAA. Ramakrishna wrote an open letter to Prashant Kishore to give some advice to Jagan also about CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X