• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెంకయ్యది కన్నీరు కాదు, రైతుల రక్తం - గర్భగుడికి అడ్డం వీపీనే -సీజేఐ రమణ -జగన్ క్షమాపణ: సీపీఐ నారాయణ

|

పార్లమెంటులో విపక్ష ఎంపీలు నిరసన తెలిపిన తీరు.. దేవాలయంలో గర్భగుడిని అపవిత్రం చేసినట్లుగా అనిపించిందన్న రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఐ జాతీయ నేత నారాయణ సైతం వెంకయ్యపై సెటైర్లు వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సీజేఐ రమణ భేటీ, ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత మరణాలపై జగన్ సర్కారు నివేదిక తదితర అంశాలపైనా నారాయణ తనదైన శైలిలో అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీతో ట్విటర్ మిలాఖత్ -రాహుల్ గాంధీ సహా 5వేల అకౌంట్ల రద్దుపై ప్రియాంక ధ్వజంకాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీతో ట్విటర్ మిలాఖత్ -రాహుల్ గాంధీ సహా 5వేల అకౌంట్ల రద్దుపై ప్రియాంక ధ్వజం

వెంకయ్య ఏడుపులో అర్థముందా?

వెంకయ్య ఏడుపులో అర్థముందా?

పెగాసస్, రైతుల ఉద్యమం తదిర అంశాలపై ప్రతిపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆసాంతం వృధాగా పోయిన నేపథ్యంలో విపక్షాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీలు రాజ్యసభలో నిరసనలు తెలిపిన తీరు.. దేవాలయంలో గర్భగుడిని అపవిత్రం చేసిన రీతిలో ఉందన్న వెంకయ్య.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంలో కన్నీరు కూడా కార్చారు. ‘‘కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభలో ప్రవర్తించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేయడానికి, అలాంటి చర్యలను ఖండించడానికి నాకు మాటలు రావడం లేదు. రాత్రంతా నిద్రపట్టలేదు. సభ ఈ స్థాయికి ఎలా వచ్చిందనే కారణాన్ని అన్వేషించడానికి చాలా ప్రయత్నించాను. సభకు పవిత్రత ఉంది. మన దేవాలయాల్లో భక్తులను గర్భగుడి వరకే అనుమతిస్తారు తప్పితే అంతకుమించి లోపలికి రానివ్వరు. ఈ సభామందిర గర్భగుడిలోకి ప్రవేశించడమే అపవిత్ర చర్య. కొందరు సభ్యుల తీరు నన్నెంతో క్షోభకు గురిచేసింది'' అని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేయగా, వెంకయ్య ఏడుపులో అసలు అర్థమే లేదని సీపీఐ నారాయణ అన్నారు.

అది కన్నీరు కాదు, రైతుల నెత్తురు

అది కన్నీరు కాదు, రైతుల నెత్తురు

రాజ్యసభలో తీవ్ర భావోద్వేగానికి లోైన వెంకయ్య నాయుడు.. సభను సజావుగా నడపడానికి తాను ఎంత ప్రయత్నించినా వినిపించుకోకుండా కొందరు సభ్యులు ఎందుకు అలా వ్యవహరించారో అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొందని, మంగళవారం నాడు విపక్ష ఎంపీలు సభలో రచ్చ చేసిన తీరును వీడియో తీసి కొందరు ఎంపీలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఆందోళన కలిగించిందన్నారు. ఈ పరిణామాలపై ఆత్మవిమర్శ చేసుకుని పరిష్కారాలను ఆలోచించాలని, లేనట్లయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అసంబద్ధమవుతుందని చెప్పారు. సభ లోపలి దృశ్యాలను రాజ్యసభ టీవీ చూపించి ఉంటే బాగుండేదని, దానివల్ల తనకెలాంటి సమస్యా లేదన్నారు వెంకయ్య నాయడు. అయితే, వెంకయ్య కంట వచ్చింది కన్నీరు కాదని, రైతుల నెత్తురు అని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు.

గర్భగుడికి అడ్డమే ఆయన..

గర్భగుడికి అడ్డమే ఆయన..

‘‘పార్లమెంటును దేవాలయం అని గౌరవ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సెలవిచ్చారు. అంతేకాదు, సభలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు కూడా కార్చారు. కానీ అసలాయన చర్యలకు అర్థం ఉందా? దేవాలయం లాంటి పార్లమెంటులో ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజల ఆందోళనలపై మాట్లాడనీయరా? రాజ్యసభలో ఈ అంశాలపై చర్చ జరగనీయకుండా గర్భగుడిలో కూర్చొని అడ్డం పడింది ఎవరు? వెంకయ్య నాయుడు కాదా? రాజ్యసభ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్చింది కన్నీళ్లు కానే కాదు..ఉద్యమ రైతుల నెత్తురు'' అని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.

సీజేఐ రమణపై సీపీఐ ప్రశంసలు

సీజేఐ రమణపై సీపీఐ ప్రశంసలు

రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయడాన్ని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోగానే ఆ వ్యక్తి క్రిమినల్ రికార్డును ఆయా పార్టీలు బయటపెట్టాలని సీజేఐ రమణ ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. అదే సమయంలో సీజేఐ రమణ నేరుగావెళ్లి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ భేటీపై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టడం ఏ రాజకీయ పార్టీకీ ఇష్టం లేదని, ప్రధానంగా నరేంద్ర మోదీ కేబినెట్ లోనే 33 మందికి నేర చిత్ర ఉందని, ఈ అంశంలో పార్టీలన్నీ వ్యతిరేకత కనబరుస్తున్నా, సీజేఐ రమణ మాత్రం గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నారని నారాయణ చెప్పారు. నేర చరిత నేతల అంశంలోనే రాష్ట్రపతిని సీజేఐ రమణ కలిసుంటారని, ఏదేమైనా ఇది శుభపరిణామమే అని నారాయణ వ్యాఖ్యానించారు.

  #Krishnapatnam Medicine ఆయుర్వేదానికి పెరిగిన డిమాండ్.. పుత్తూరు కట్టు, చేప మందు సక్సెస్
  సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి..

  సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి..

  రాష్ట్రపతి వెంకయ్య నాయుడిది ముసలి కన్నీరు, సీజేఐ రమణది మంచి ప్రయత్నమని వ్యాఖ్యానించిన సీపీఐ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా వదల్లేదు. రెండ్రోజుల కిందటే, ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అక్సిజన్ కొరత వల్ల మరణాలను అంగీకరించడం, ఆమేరకు కేంద్రానికి రిపోర్టు పంపిన విషయాన్ని ఆరోగ్య మంత్రి భారతి రాజ్యసభలో ప్రకటించడం తెలిసిందే. అయితే, సదరు రిపోర్టులో ఏపీలో ఆక్సిజన్ కొరత మరణాల సంఖ్యపై జగన్ సర్కారు అబద్ధం చెప్పిందని నారాయణ ఆరోపిచారు. ‘‘తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా రుయాలో ఆక్సిజన్ కొరత కారణంగా 23 మంది చనిపోతే.. కలెక్టర్ నివేదిక ఆధారంగా 11 మంది అని సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన అపద్ధం. రుయా మరణాలపై సీఎం జగన్, జిల్లా కలెక్టర్.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా సీఎం నాయకత్వం వహించి.. అఖిలపక్ష రాజకీయ పార్టీలతో వొత్తిడి చేయిస్తే కేంద్రం దిగి వస్తుంది. వైసీసీ ప్రభుత్వం ఏపీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడుతూ ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తోంది'' అని నారాయణ మండిపడ్డారు.

  English summary
  cpi national leader narayana slams vice president venkaiah naidu over incidents in rajya sabha amid parliament monsoon session. cpi narayana blames venkaiah and trashed vp emotional speech. cpi leader son criticizes andhra pradesh chief minister ys jagan over oxygen shortage deaths and appreciates cji nv ramana efforts on political criminals
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X