వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'అందుకు.. మోడీని వందసార్లు షూట్ చేయాలి'
హైదరాబాద్ : నేతలపై సెటైరికల్ స్టేట్ మెంట్స్ తో వార్తల్లోకి ఎక్కే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా మరోసారి వివాదస్పద కామెంట్స్ చేశారు. గుజరాత్ లో దళితులపై దాడులు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తడంతో.. దీనిపై స్పందించిన నారాయణ మోడీ తీరును తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

దళితులపై దాడుల నేపథ్యంలో.. మోడీని వందసార్లు తుపాకులతో కాల్చాలని కామెంట్ చేశారు నారాయణ. ఎన్డీయే వచ్చాక దళితులపై జరిగిన దారుణాలకు మోడీని వందసార్లు షూట్ చేసినా సరిపోదని అన్నారు. దళితులపై దాడులను ఖండిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలను కపట ప్రేమగా అభివర్ణించిన నారాయణ.. దళితులపై దాడి చేయాలంటే తనపై దాడి చేయాలని మోడీ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు.