వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో సీఎం జగన్ బెదిరింపు వ్యాఖ్యలపై మండిపడిన సీపీఐ నారాయణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన CPI నేత నారాయణ | Narayana Expressed Anger Over AP CM Jagan

ఏపీ సీఎం జగన్ పై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . అసెంబ్లీలో సీఎం జగన్ మేం తలుచుకుంటే అంటూ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు .నిన్నటి ఏపీ శాసనసభ సమావేశాల్లో తన ప్రసంగానికి అడ్డు వస్తున్న టీడీపీ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, తాము 150 మంది ఉన్నామని... మేం తలుచుకుంటే సభలో ఒక్క టీడీపీ సభ్యుడు కూడా ఉండడని వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. సీపీఐ నారాయణ కూడా ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

బాలయ్య ఇప్పుడైనా ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తారా .. సినిమాలపై శ్రద్ధ పెడతారా ?బాలయ్య ఇప్పుడైనా ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తారా .. సినిమాలపై శ్రద్ధ పెడతారా ?

ఇది చాలా దారుణం అయిన వ్యాఖ్యగా ఆయన భావిస్తూ చేసిన ట్వీట్ లో మేము 151 మంది సభ్యులున్నాం. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అత్యున్నత శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు టీడీపీని ఉద్దేశించి ఇలా మాట్లాడారు. సభలో ఉన్న టీడీపీ 23 మంది శాసనసభ్యులకే రక్షణ లేకపోతే... అంతకన్నా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్షాలపై చట్టసభల్లో అప్రకటిత నిషేధమేనా?' అంటూ నారాయణ విమర్శించారు. సభ్యులు తక్కువగా ఉంటే వారికి రక్షణ ఉండదా ? జగన్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయని , ఇక ప్రతిపక్ష టీడీపీ నే అలా బెదిరిస్తుంటే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అన్నది నారాయణ పాయింట్.

CPI Narayana furious over threatening comments made by CM Jagan in assembly

నిన్న సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మావాళ్లు 151 మంది ఉన్నారని, మేం తలచుకుంటే వాళ్లు ఏమౌతారని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు గందరగోళం జరిగిందని , ఇక ఆ తర్వాత వైసీపీ నేతలు ఆరేడు మంది మాట్లాడారని, టీడీపీ నుంచి ఒకరైనా సరే సమాధానం చెప్పాలని ప్రయత్నం చేస్తామన్నారు. అధికారపార్టీ విమర్శలు చేసినప్పుడు.. తమ వెర్షన్ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తమ సంఖ్య తక్కువ ఉందని, మేం తలచుకుంటే ఏమౌతారని సీఎం జగన్ అంటున్నారని ఇది ఎంతవరకు సబబని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపైన పెద్ద ఎత్తున సీఎం జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
CPI leader Narayana expressed outrage over AP CM Jagan. CPI leader Narayana has reacted to the threats made by CM Jagan in the Assembly. "Addressing the TDP members who were blocking his speech at yesterday's AP legislative session, Chief Minister Jagan said that there are 151 ycp people ... If we think there is not a single TDP member in the House. Leaders of various parties vehemently oppose these comments made by Jagan in the CM status. These comments are flawed. CPI Narayana also criticized on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X