వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'

|
Google Oneindia TeluguNews

Recommended Video

ChandraBabu And Modi Will Fight Against Each Other

చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఐ నేత నారాయణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనను దుయ్యబట్టడంతో పాటు నవ్యాంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సహకారం లేకపోవడంపై ఆయన ఆసక్తికర, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?

ప్రధాని మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులకు మరో రూపం మోడీ అని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి విభజన సమయంలో హామీల కోసం అందరు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

 బాబు, మోడీలకు పాత కక్షలు

బాబు, మోడీలకు పాత కక్షలు

ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాత కక్షలు ఉన్నాయని, ఆ కక్షను ప్రధాని ఇప్పుడు ఏపీ ప్రజల పైన తీర్చుకుంటున్నారని నారాయణ ఘాటుగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, హోదా మాత్రమే కావాలని కుండబద్దలు కొట్టారు.

 దానిని ఉద్దేశించే అన్నారా

దానిని ఉద్దేశించే అన్నారా

కాగా, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నాడు గుజరాత్ సిఎంగా ఉన్న మోడీపై విమర్శలు చేశారు. దీనిని ఉద్దేశించే నారాయణ ఇలా వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.

 బాబు అఖిల సంఘంతో కలవడంపై షరతు

బాబు అఖిల సంఘంతో కలవడంపై షరతు

ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం కోసం అఖిల సంఘాల భేటీ వేస్తామని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అంశం పైన కూడా నారాయణ స్పందించారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడేటట్టు అయితేనే అఖిలపక్షంతో కలుస్తామని, లేదంటే కలిసేది లేదన్నారు.

 టీడీపీ నిలదీయడంలో తప్పు లేదు

టీడీపీ నిలదీయడంలో తప్పు లేదు

విభజన హామీలు అమలు చేయలేదంటూ టీడీపీ చేపడుతున్న నిరసనలను ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సమర్థించారు. డిమాండ్లను నెరవేర్చాలని అడగడంలో తప్పు లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ అవశిష్టంగా మిగిలిపోయిందని, ఏపీకి ఎన్నో చేస్తామని చెప్పారని, కానీ అవేమీ నెరవేరలేదని, ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నిలదీయడంలో తప్పు లేదన్నారు.

బిగ్గరగా అడిగారు

బిగ్గరగా అడిగారు

ఇంకా చెప్పాలంటే ఎంపీలు బిగ్గరగా, స్పష్టంగా అడిగారని అశోక్ అన్నారు. సున్నితమైన ఈ అంశాలపై నాయకులను నిర్ణయం తీసుకోనివ్వాలని, తాము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు. యూపీఏ సమయంలో అశాస్త్రీయంగా, హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారనీ, అందుకే ఇప్పుడు సమస్యలు తలెత్తాయన్నారు.

English summary
CPI leader Narayana make hot comments on Prime Minister Narendra Modi over poll promises to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X