వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చాలానే ఊహించుకున్నా.. వెంకయ్య పంచెలో ఏమి లేదని అర్థమైంది!'

|
Google Oneindia TeluguNews

విజయవాడ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సీపీఐ నేత నారాయణ మధ్య పంచెల పంచాయితీ నడుస్తోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. గతంలో సీపీఐ నారాయణ తనపై చేసిన కామెంట్స్ కు గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు వెంకయ్య. తాజాగా ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మరోసారి వెంకయ్య పంచెపై పడ్డారు సీపీఐ నారాయణ.

హోదా విషయంలో వెంకయ్య నాయుడు గురించి తాను కూడా చాలానే ఊహించుకున్నానని చెప్పుకొచ్చిన నారాయణ.. ఆరవ తేదీ అర్థరాత్రి గానీ తనకు అసలు విషయం బోధపడలేదన్నారు. వెంకయ్యలో గానీ వెంకయ్య పంచెలో గానీ ఏమి లేదన్న విషయం ఆరో తేదీ అర్ధరాత్రే తనకు అర్థమైందన్నారు నారాయణ. అప్పుడేమో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వెంకయ్య ఇప్పుడు మాత్రం ఊసరవెల్లిలా మారిపోయారని ఆరోపించారు.

CPI Narayana satirical comments on venkaiah

వెంకయ్యది నాలుకా..? తాటిమట్టా..? అని ప్రశ్నించిన నారాయణ.. ప్రత్యేక హోదా కోసం జిల్లాలన్ని తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య, తీరా ఇప్పుడు మాటే మార్చేశారన్నారు. ఇదిలా ఉంటే.. మొన్నామధ్య వెంకయ్య పంచె ఊడగొట్టాలంటూ నారాయణ చేసిన సెటైరికల్ కామెంట్స్ కు.. అంతే సెటైరికల్ గా.. నా పంచె ఊడగొట్టాల్సినంత ఆసక్తి ఎందుకో అంటూ వెంకయ్య కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఒకరిపై ఒకరు కౌంటర్ ఎటాక్ చేసుకుంటూ.. పంచెల పంచాయితీని మరింత రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు నేతలు.

English summary
CPI Narayana made some satirical comments on Central minister venkaiah Naidu. He said 'i know there was no matter in venkaiah panche' but i realized after 6th of this month to know this
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X