• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణ

|

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, ఈ త్రిమూర్తుల వల్లే ఏపీకి నష్టం వాటిల్లుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సదరు నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్‌కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనండ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్‌కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనం

 మోడీ కాళ్లు పట్టుకున్న జగన్..

మోడీ కాళ్లు పట్టుకున్న జగన్..

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను తాను చేసిన ఆర్థిక నేరాలకు జైలు పాలవుతాననే భయం వెంటాడుతోందని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను జగన్ పట్టుకున్నారని, జైలు భయంతోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెడుతోన్న బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తున్నదని నారాయణ విమర్శించారు. రైతులకు తీరని నష్టం చేసే వ్యవసాయ బిల్లులపై వైసీపీ కనీసమాత్రంగానైనా ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పడు చేతుతెల్లేశారని, గతంలో చంద్రబాబుకు పట్టిన గతే త్వరలో జగన్ కు పడుతుందని నారాయణ ఎద్దేవా చేశారు.

 కాళ్లు మొక్కడంలో పోటీ..

కాళ్లు మొక్కడంలో పోటీ..

అక్రమాలకు సంబంధించిన కేసుల నుంచి సురక్షితంగా ఉండాలనే వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటాపోటీగా ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో వైరిపక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీలు.. కేంద్రానికి సాగిలపడటంలో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయని, ఇద్దరూ కలిసి రైతుల వెన్ను విరిచే వ్యవసాయ బిల్లులకు మద్దతు పలకడం దివాళకోరు రాజకీయాలకు నిదర్శనమని సీపీఐ నేత మండిపడ్డారు.

 విశాఖలో లెఫ్ట్ పార్టీల నిరసన

విశాఖలో లెఫ్ట్ పార్టీల నిరసన

వివాదాస్పద వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొంది రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ మంగళవారం విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఏపీలోని రాజకీయ పార్టీల తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 బుద్ధి తక్కువై పవన్‌లో పొత్తు

బుద్ధి తక్కువై పవన్‌లో పొత్తు

‘‘టీడీపీ, వైసీపీల బాటలోనే, జగన్, చంద్రబాబుకు పోటీగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సైతం ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరిస్తున్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ మాసికం చేసుకుంటున్నాడు. గత ఎన్నికల్లో బుద్ది తక్కువై మేము పవన్ కల్యాణ్ ను నమ్మి, ఆయనతో పొత్తు పెట్టుకున్నాం'' అని నారాయణ వ్యాఖ్యానించారు. తాము విశాఖ అభివృద్ధిని కోరుతున్నామని అయితే, సీపీఐకి సంబంధించినంత వరకు ఏపీ రాజధాని అమరావతే అని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని నారాయణ స్పష్టం చేశారు.

  Left Parties's State Wide Dharna Over Bifurcation Promises

  పోలీస్ బాస్ రాసలీలలు: బయటపెట్టిన భార్యపై దాడి - వీడియో వైరల్ - సీఎం సీరియస్ - విదేశాల్లో విలాసాలుపోలీస్ బాస్ రాసలీలలు: బయటపెట్టిన భార్యపై దాడి - వీడియో వైరల్ - సీఎం సీరియస్ - విదేశాల్లో విలాసాలు

  English summary
  CPI national secretary k.Narayana said that Andhra Pradesh is suffering due to Chief Minister ys Jagan, TDP chief Chandrababu and Janasena chief Pawan Kalyan. He said that injustice was being done to the state because of them. Narayana criticized the YSRCP, TDP and Janasena during a Left-led protest at the GVMC Gandhi statue in Visakhapatnam on Tuesday against the anti-farmer and anti-agriculture laws introduced by the central government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X