వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా ఎందుకు కరెక్టు.... పవన్ సమాధానం చెప్పాలి

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రస్తుత రోజుల్లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి నాయకులు అవసరమంటూ.. పవన్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా నాయకత్వం దేశానికి ఎందుకు అవసరమో పవన్ కల్యాణ్ స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు.

దేశంలో నిరంకుశపాలనను అందిస్తున్నఅమిత్ షా లాంటి నాయకత్వం అవసరమా అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఎందుకు కరెక్టో అయన సమాధానం చెప్పాలని అన్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతలు మోడీ, అమిత్ షాలకు భయపడుతున్నారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ నేతలను ఎందుకు పొగుడుతున్నారని ఆయన పవన్‌ను ప్రశ్నించారు.

Recommended Video

News Roundup : Cabinet Clears Citizenship Amendment Bill || Disha Issue || Oneindia Telugu
cpi opposed PawanKalyans comments on amit shah

గత మూడు రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఓ వైపు అధికార వైసీపీని టార్గెట్ చేస్తూనే.. మరోవైపు బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తాను ఎనాడు దూరం లేదని చెప్పిన ఆయన ప్రత్యేక హోదా కోసమే ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేశానని అన్నారు. దీంతో పాటు దేశంలో అమిత్ షా లాంటీ నాయకులు అవరమని వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టీడీపీ నేత అచ్చ నాయుడు మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటీ తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవసరాల కోసమే బీజేపీపై పోరాటం చేశామని , వ్యక్తిగతంగా ఎలాంటీ విబేధాలు ఇరుపార్టీల మధ్య లేవని సమర్ధించారు.

English summary
why the union home minister amit shah correct to nation, what need of amit shah to country ? pawankalyan has to say, deamand the cpi ramakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X