వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సీఎం పదవి కోసం జగన్ ఇంత దిగజారిపోయారా, మోడీ చెప్పారా'

వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం ఇంత దిగజారిపోయారా, అలాగైతే పాదయాత్ర మానేయాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం ఇంత దిగజారిపోయారా, అలాగైతే పాదయాత్ర మానేయాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

విశాఖలో అభిమానుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు, ఐనా సంతోషమే!విశాఖలో అభిమానుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు, ఐనా సంతోషమే!

ముఖ్యమంత్రి అయ్యేందుకు రెండేళ్ల పాటు హైదరాబాద్‌లో చండీయాగం చేస్తుండడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

మోడీ చెప్పారా?

మోడీ చెప్పారా?

యాగాలతో ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు జగన్ తన పాదయాత్ర చేపట్టడం మానేస్తే మంచిదని రామకృష్ణ సూచించారు. యాగాలు చేయాలని ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ఏమైనా సలహా ఇచ్చారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

Recommended Video

YSRCP To Win AP in 2019 : Survey Reports
వెంకయ్యకు అల్టిమేటం

వెంకయ్యకు అల్టిమేటం

విభజన చట్టంలో పెట్టిన అంశాలతోపాటు 2014 ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే వెంకయ్య ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

ఆ అవకాశం ఉండదు

ఆ అవకాశం ఉండదు

విశాఖకు రైల్వేజోన్‌, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, లోటు బడ్జెట్‌ భర్తీ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వంటి అంశాలను గాలికి వదిలేయడం దారుణం అన్నారు. వెంకయ్య కేంద్రమంత్రిగా కొనసాగితే, బిజెపి హామీల అమలుకు ఆయనపై ఒత్తిడి తెచ్చే అవకాశముండేదని, ఉపరాష్ట్ట్రపతి అయ్యాక ఆ అవకాశం ఉండదన్నారు.

రామ్ మాధవ్ కోసమే

రామ్ మాధవ్ కోసమే

బిజెపి ఆరెస్సెస్ కనుసన్నల్లో పని చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు. ఆరెస్సెస్‌కు చెందిన రామ్ మాధవ్‌కు రాష్ట్రాన్ని అప్పగించేందుకే వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి ప్రయత్నిస్తోందని, దేశంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.

పవన్ కళ్యాణ్ స్పందించాక

పవన్ కళ్యాణ్ స్పందించాక

ఉద్దానం కిడ్నీ సమస్యను గతంలో తమ పార్టీ నేత కె నారాయణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, పవన్‌ కళ్యాణ్ రంగంలోకి దిగాకే ముఖ్యమంత్రి దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని రామకృష్ణ అన్నారు.

English summary
CPI Ramakrsihna on Monday lashed out YSR Congress Party chief YS Jaganmohan Reddy for Yagnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X