వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్‍‌కు జగన్ ఓ బకరాలా దొరికాడు, చంద్రబాబును ఓడించకుంటే ప్రమాదం'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సీపీఐ నేత రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకాశం జిల్లాలో జగన్ పైన విమర్శలు గుప్పించారు.

<strong>వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్‌బై, జగన్‌పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..</strong>వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్‌బై, జగన్‌పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..

 జగన్ ఓ బకరాలా దొరికాడు

జగన్ ఓ బకరాలా దొరికాడు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు జగన్ ఓ బకరాలా దొరికాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాగం అందుకున్నారని విమర్శలు గుప్పించారు. మోడీ డైరెక్షన్‌లో కేసీఆర్, ఆయన డైరెక్షన్‌లో జగన్ నడుస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్‌తో కలిసి వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరు

కేసీఆర్‌తో కలిసి వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరు

బీజేపీకి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందని రామకృష్ణ అన్నారు. ప్రధాని మోడీకి ఉపయోగపడేలా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ దానిని మానుకోవాలని హితవు పలికారు. ఫెడరల్ ఫ్రంట్‌ను రద్దు చేయాలన్నారు. కేసీఆర్ ఫ్రంట్‌తో కలిసి వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని జోస్యం చెప్పారు.

చంద్రబాబును ఓడించకుంటే ప్రమాదం

చంద్రబాబును ఓడించకుంటే ప్రమాదం

దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ఓడించకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడడం ఖాయమన్నారు.

English summary
CPI Ramakrsihna satire on YSR Congress Party chief YS Jagan Mohan Reddy. He called people to defeat Chandrababu Naidu and Telugudesam in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X