వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్ పథకాలకు జగన్ పంగనామాలు- సీపీఐ నారాయణ విసుర్లు...

|
Google Oneindia TeluguNews

దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాలకు జగన్‌ సర్కారు పంగనామాలు పెడుతోందని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ విమర్శించారు. గతంలో ఉచిత విద్యుత్‌ కోసం వైఎస్సార్‌ పోరాటాలు చేసి దాన్ని అమల్లోకి తెచ్చారని, కానీ జగన్ సర్కారు ఈ పథకాన్ని ఎత్తేసేందుకు దానిలో కోతలు పెడుతున్నారని నారాయణ విమర్శించారు.

ఎన్నికల్లో మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్‌ ఇప్పుడు ఉచిత విద్యుత్‌ విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారని సీపీఐ నారాయణ ఆక్షేపించారు. ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లను పెట్టాలన్న జగన్ సర్కారు నిర్ణయం సరికాదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడమే అన్నారు. గతంలో వైఎస్‌ ఉచిత విద్యుత్ కోసం పోరాటాలు చేసినప్పుడు అప్పట్లో సీపీఐ కూడా కాంగ్రెస్‌తో కలిసి ఇందుకోసం పోరాడింది. ఆ తర్వాత వైఎస్‌ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తెచ్చారు.

cpi senior leader narayana criticizes ap cm ys jagans policy on free power

Recommended Video

Petrol Bunks Install Cheat Chips మీటర్లలో చిప్‌లు అమర్చి మోసాలు, లీటరుకు 40 ఎంఎల్‌ మోసం!!

కానీ ప్రస్తుతం వైసీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు లొంగి ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న నిర్ణయం తీసుకుంది. నగదు బదిలీ చేస్తామని హా్మీలు ఇస్తున్నా రైతుల్లో మాత్రం అనుమానాలు తొలగిపోలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో వామపక్షాలు ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English summary
cpi senior leader narayana critisizes ruling ysrcp government's policy on free power to farmers. narayana says that cm jagan scrapping his late father ysr's policy on free power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X