వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై దాడులు చేసినా పట్టించుకోను, ఇది పద్దతికాదు: పవన్ కళ్యాణ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో మార్చి 1వ, తేదిన గుంటూరులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె. రామకృష్ణ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కోరారు. మరో వైపు ప్రత్యేక హోదాపై చర్చల్లో పాల్గొన్నవారిపై దాడులకు దిగడాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో వాస్తవాలను తేల్చేందుకు ఏర్పాటు చేసిన జెఎప్‌సపి తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై గురువారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చర్చించారు.

రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడ ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రంలో జరుగుతున్న సభలు, సమావేశాలపై కూడ నేతల మధ్య చర్చ జరిగింది.

పవన్ కళ్యాణ్‌తో రామకృష్ణ బేటీ

పవన్ కళ్యాణ్‌తో రామకృష్ణ బేటీ

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. జెఎప్‌సి సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు. జెఎప్‌సి రెండు రోజుల పాటు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.జెఎఫ్‌సి సమావేశాల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు. మార్చి 1న గుంటూరులో జరగనున్న రౌండ్‌‌టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్‌కల్యాణ్‌ను రామకృష్ణ ఆహ్వానించారు.

అప్పటివరకు ఓపికగా ఉంటాం, రాజకీయ నిర్ణయం తీసుకొంటాం: ఆది సంచలనంఅప్పటివరకు ఓపికగా ఉంటాం, రాజకీయ నిర్ణయం తీసుకొంటాం: ఆది సంచలనం

నాపై దాడులు చేసినా పట్టించుకోను

నాపై దాడులు చేసినా పట్టించుకోను

ప్రత్యేక హోదాపై టీవీల్లో చర్చలు జరుగుతుండగా దాడులు చేయడమేంటని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలదీశారు. జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ కొనసాగింపుగానే రామకృష్ణ కలిశారని తెలిపారు. "నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా..పట్టించుకోను, కానీ నిరసన వ్యక్తం చేసే వారిపై దాడులు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఆ హమీలు నెరవేర్చాల్సిందే, కేంద్రం పోరాటమే: బాబు షాకింగ్ కామెంట్స్ ఆ హమీలు నెరవేర్చాల్సిందే, కేంద్రం పోరాటమే: బాబు షాకింగ్ కామెంట్స్

రౌండ్ టేబుల్ సమావేశానికి హజరౌతానో లేదో చెప్పలేను

రౌండ్ టేబుల్ సమావేశానికి హజరౌతానో లేదో చెప్పలేను

మార్చి 1వ, తేదిన గుంటూరులో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి తాను హజరౌతానో లేదో చెప్పలేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.విద్యుత్ కార్మికులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నానన్నారు. మార్చి 1న గుంటూరులో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతానో లేదో రెండ్రోజుల్లో చెబుతానని వెల్లడించారు. ఆ రోజున ఇతర కార్యక్రమాలు ఉన్నందున అక్కడి నిర్వాహకులను ఒప్పించాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు.

ఏపీకి న్యాయం చేయాలని కోరుతున్నాం

ఏపీకి న్యాయం చేయాలని కోరుతున్నాం

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టే న్యాయం చేయమంటున్నామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై టీవీల్లో చర్చలు జరిపేవాళ్లపై దాడులు చేయడం సరైన వైఖరి కాదన్నారు. ఎవరు దాడులు చేస్తున్నారో వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Cpi Ap state secretary Ramakrishna met Janasena chief Pawan kalyan on Thursday at Hyderabad.Ramakrishna invited Pawan kalyan to attend round table meeting on March 1 at Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X