విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పవర్ హైక్‌పై సీపీఎం నిరసన దీక్ష, ప్రజాభిప్రాయం సేకరించండి, కొత్త విద్యుత్ చట్టంపై గుస్సా..

|
Google Oneindia TeluguNews

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం మంగళవారం నిరసన దీక్ష చేపట్టింది. ఉదయం 9 గంటలకు సీపీఎం కార్యదర్శి పీ మధు ప్రారంభించగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, నగర కార్యదర్శి డీ విష్ణువర్ధన్ తదితరుల దీక్ష చేపట్టారు. సీపీఎం చేపట్టిన దీక్షకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

ప్రజలపై భారం..

ప్రజలపై భారం..

విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై భారం పడిందని సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. చార్జీల పెంపుపై ప్రభుత్వం సమీక్షించాలని ఆయన కోరారు. చార్జీల పెంపుపై వివరణ కాదు.. రాయితీ ఇవ్వాలన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి అని.. ఇది కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య అని మండిపడ్డారు. దీంతో విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరం అవుతోందని తెలిపారు. అలా అయితే రైతులకు ఉచిత కరంట్ ఇచ్చే పరిస్థితి ఉండబోదన్నారు. కరోనా వైరస్ వల్ల పేదల పరిస్థితి దయనీయంగా మారిందని.. వారికి నెలకు 7500 చొప్పున 6 నెలలపాటు సాయం చేయాలన్నారు. రైతులు, కూలీలు, పేదల కోసం ఏడాది నుంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.. కానీ వారి జీవన ప్రమాణస్థాయి పెరగడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు సవరిస్తే వారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద లేఖ5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద లేఖ

ప్రజాభిప్రాయం సేకరణ..?

ప్రజాభిప్రాయం సేకరణ..?

విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల అభిప్రాయం తీసుకోవాలని సీహెచ్ బాబురావు అన్నారు. ‘మన పాలన మీ సలహా' కార్యక్రమంలో సజెషన్ తీసుకోవాలని కోరారు. విద్యుత్ చార్జీల పెంపుపై తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని ఏపీ కూడా వ్యతిరేకించాలని స్పష్టంచేశారు. దీనిపై సీఎం జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మిగతా సీఎంలు బాహాటంగా వ్యతిరేకిస్తుంటే.. జగన్ మాత్రం నోరు మెదపకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై టీడీపీ కూడా మౌనమునిలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలానే వ్యవహరించిందని గుర్తుచేశారు.

రద్దు చేస్తే బెటర్..?

రద్దు చేస్తే బెటర్..?


కరోనా వైరస్ నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు 160 కోట్ల రాయితీ ఇవ్వడాన్ని బాబురావు స్వాగతించారు. అయితే ప్రజలు ఉపయోగించే బిల్లులు కూడా రద్దు చేస్తే బాగుంటుందని సూచించారు. కానీ బిల్లులు పెంచడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని వివరించాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు దోచిపెట్టి.. పేదల కడుపుకోడతారా అని మండిపడ్డారు.

English summary
cpm leaders one day hunger strike at vijayawada. power hike is not correct cpm secretary madhu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X