వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ ఎఫెక్ట్, బీజేపీపై ఆగ్రహం: వస్తే మేం రెడీ.. బాబుకు మధు బంపరాఫర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఎం మధు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. బడ్జెట్‌లో ఏమాత్రం న్యాయం జరగలేదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.

ఆదివారం ఎంపీలతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. బీజేపీ తీరు ఇలాగే ఉంటే, చంద్రబాబు నేతృత్వంలో జాతీయస్థాయిలో ఏకమయ్యేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని హెచ్చరికలు జారీ చేశారు.

మధు ఆసక్తికర వ్యాఖ్యలు

మధు ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదే సమయంలో, సీపీఎం మధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతులకు, యువతకు ఎలాంటి ఊరట లభించలేదన్నారు. రేపు వామపక్ష నేతలు భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో ఎవరు తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చినా వారితో కలిసి పని చేస్తామని చెప్పారు.

బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?

చంద్రబాబుకు ఆఫర్

చంద్రబాబుకు ఆఫర్

ఈ ఆఫర్ టీడీపీకి అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పేలా ఉంది. అదే సమయంలో సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తామని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు మధు మాట్లాడుతూ.. బయటకు వచ్చే వారితో కలిసి పని చేస్తామని చెప్పడం అంటే చంద్రబాబుకు ఆఫర్ అని చెప్పవచ్చు.

బాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటేబాబును తక్కువ అంచనా వేయొద్దు, అంతా పొగరు: మోడీపై టీజీ సంచలనం, తెగదెంపులు ఎప్పుడంటే

చంద్రబాబు, జగన్ కారణం

చంద్రబాబు, జగన్ కారణం

బడ్జెట్ మాయాబజార్ సినిమాలా ఉందని, ప్రధాని మోడీ మాయల పకీర్ అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. బీజేపీకి ఇదే ఆఖరి బడ్జెట్ కావాలన్నారు. రైతులకు మద్దతు ధర ఓ మాయ అన్నారు. పోలవరానికి నిధులు లేవని, కేంద్ర సంస్థలు లేవని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడానికి చంద్రబాబు, జగన్‌లు కారణం అన్నారు.

మోడీ మట్టి ఇచ్చినప్పుడే

మోడీ మట్టి ఇచ్చినప్పుడే

ప్రధాని మోడీ మట్టి ఇచ్చినప్పుడే అప్రమత్తం కావాలని తాము చెప్పామని రఘువీరా అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోను షరతులు పెట్టాలని గుర్తు చేశామన్నారు. మోడీ వద్ద చంద్రబాబు, జగన్‌లు దాసోహం అయ్యారని చెప్పారు. ఏపీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే న్యాయం జరుగుతుందన్నారు. రాజీనామా చేసి వస్తే కలిస ఉద్యమిద్దామన్నారు. జగన్, చంద్రబబులు ఇద్దరూ మోడీకి తోబుట్టువులు అన్నారు.

ఎలాంటి బేషజాలు లేవు

ఎలాంటి బేషజాలు లేవు


ఒకరు కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటే, మరొకరు జగన్ షరతుల్లేని మద్దతు ప్రకటించారని రఘువీరా అన్నారు. లోకసభలో 25 ఎంపీలు ఈ రాష్ట్రానికి ఉన్నారని, వారంతా వెనువెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ రాష్ట్రానికి ఆలస్యమైనా వెంటనే న్యాయం జరగాలంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. కలిసి ఉద్యమించేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. చట్టప్రకారం, పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాల్సిందే అన్నారు.

వైసీపీకి చురకలు

వైసీపీకి చురకలు

టీడీపీ, వైసీపీలు రాజీనామా డ్రామాలు కట్టిపెట్టాలని రఘువీరా చురకలు అంటించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ ఎంపీలు అడుగుతారని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ పార్టీ వారు అడుగుతారని, మీరిద్దరూ మోడీకి తోబుట్టువులే అన్నారు. ఒకరు లోపల, ఒకరు బయట బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించరని, నోట్ల రద్దు, జీఎస్టీ గురించి ప్రశ్నించరని, నల్లధనం తేలేదేమని ప్రశ్నించరని, పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే, రాజ్యంగాన్ని సమీక్షిస్తామంటే ప్రశ్నించరని నిప్పులు చెరిగారు.

English summary
CPM Madhu open bumper offer to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X