వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలిసి నడుస్తారా: 'ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఆఫర్ గురించి ఆలోచిస్తాం'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పైన, త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్తారనే వార్తలపై సిపిఎం నేత రాఘవులు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పైన, త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్తారనే వార్తలపై సిపిఎం నేత రాఘవులు స్పందించారు.

'మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే ''మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే '

పవన్ కళ్యాణ్, జగన్‌ల నిర్ణయం మంచిదే

పవన్ కళ్యాణ్, జగన్‌ల నిర్ణయం మంచిదే

పవన్ కళ్యాణ్, జగన్‌లు పాదయాత్ర లేదా ఇతర మార్గాల ద్వారా ప్రజలలోకి వెళ్లడం మంచిదేనని రాఘవులు అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లాలని భావించడాన్ని ఆయన స్వాగతించారు.

జగన్ పార్టీ తీరును తప్పుబట్టారు

జగన్ పార్టీ తీరును తప్పుబట్టారు

అయితే పాదయాత్ర కోసమంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లక పోవడాన్ని రాఘవులు తప్పుబట్టారు. వైసిపి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ ఆఫర్ గురించి అప్పుడు ఆలోచిస్తాం

పవన్ కళ్యాణ్ ఆఫర్ గురించి అప్పుడు ఆలోచిస్తాం

వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశముందనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. పవన్ కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నారు. దీనిపై రాఘవులు మాట్లాడుతూ.. జనసేన విధానాలు ప్రకటిస్తే పవన్ ఆఫర్ గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ వల్లే అధికారంలోకి బీజేపీ

కాంగ్రెస్ వల్లే అధికారంలోకి బీజేపీ

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పైన మండిపడ్డారు. కాగా, వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన, లెఫ్ట్ జత కట్టే అవకాశాలున్నాయని చాలా రోజులుగా భావిస్తున్నారు.

English summary
CPM leader Raghavylu said that they are waiting for Jana Sena policies. He said that they will finalise when Pawan Kalyan released his policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X