ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షపునీరు చేరడానికి కిటీకీలు తెరిచిఉండడమే కారణం: సిఆర్డీఎ కమిషనర్ శ్రీధర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపు నీరు చేరడంపై అధికారులు ఆరాతీశారు. వర్షం నీరు వచ్చిన ప్రాంతాలను సిఆర్ డి ఎ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపు నీరు చేరడంపై అధికారులు ఆరాతీశారు. వర్షం నీరు వచ్చిన ప్రాంతాలను సిఆర్ డి ఎ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.

ఐదో బ్లాక్ లో సర్ రూప్ నుండి వర్షపు జల్లు కొట్టుకురావడం వల్లే భవనంలోకి నీరువచ్చిందని శ్రీధర్ మీడియాకు వివరించారు. అసెంబ్లీ నిర్మాణం తర్వాత తొలిసారిగా వర్షం రావడంతో నిర్మాణలోపాలు అర్ధమయ్యాయన్నారు.

rain

కొన్ని చోట్ల కిటీకీలు మూయకపోవడం వల్లే లోనికి వర్షపు నీరు వచ్చిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిర్మాణ కంపెనీల ప్రతినిధుతలో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.

విపక్షనాయకుడు జగన్ చాంబర్ లోకి నీరు రావడంపై చీఫ్ ఇంజనీర్ తో పరిశీలన చేయిస్తున్నట్టు సిఆర్ డిఏ కమిషనర్ చెప్పారు.

మంగళవారం నాడు కురిసిన వర్షానికే అసెంబ్లీ తాత్కాలిక సచివాలయం భవనాల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. పై కప్పుల నుండి నీరు ధారగా రావడంతో సిబబంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

English summary
CRDA commissioner Sridhar visited rain affected buildings in Amaravati.what is the reason for enter into rainwater he asked engineers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X