వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి భూ కుంభకోణంపై సీఐడీ దూకుడు: సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సీఐడీ కీలక ముందడుగు వేసింది. ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. విజయవాడలోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకుని, అనంతరం రిమాండ్‌కు తరలించారు.

2016లో రాజధాని ప్రాంతంలో గోపాలకృష్న అనే వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు మాధురిపై ఆరోపణలున్నాయి. ఆ వ్యక్తిని నెల రోజుల క్రితమే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

 CRDA Deputy Collector Madhuri arrested over illegal land registration

కాగా, ప్రస్తుతం రాయపూడి డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధురి 3 ఎకరాల 20 సెంట్ల భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రభుత్వానికి రూ. 6 కోట్లు నష్టం కలిగించినట్లు సిట్ అధికారులు తెలిపారు. మాధురిని సిట్ అధికారులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. కాగా, మాధురికి న్యాయమూర్తి మే 12 వరకు రిమాండ్ విధించారు.

Recommended Video

AP Council Abolition : Ambati Rambabu Challenges Chandrababu Over TDP MLAs And MPs Resign

కాగా, టీడీపీ హయాంలో మాధురి నెక్కల్, అనంతవరం, రాయకల్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఇదే కేసులో టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను నెల రోజుల క్రితమే సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. రావెల గోపాల కృష్ణకు డిప్యూటీ కలెక్టర్ మాధురి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. మాధురి గతంలో నెక్కల్, అనంతవరం, రాయకల్ లో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.

English summary
CRDA Deputy Collector Madhuri arrested over illegal land registration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X