వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఆర్డిఏలో భూ కేటాయింపుల వివరాలు ఇవి:మంత్రి నారాయణ వెల్లడి

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: సీఆర్‌డీఏపై గురువారంలో జరిగిన మంత్రి వ‌ర్గ ఉపసంఘం సమావేశంలో భూ కేటాయింపులకు సంబంధించి పలు కీలమమైన నిర్ణాయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.

సిఆర్డిఏలో ఇప్పటి వరకు 1312 ఎక‌రాల‌ను 65 సంస్థలకు కేటాయించామని తెలిపారు. అయితే రాజ‌ధాని ప్రాంతంలో భూ కేటాయింపులు జరిపిన 65 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏ ప‌రిధిలో భూకేటాంపులు చేసినా ఇంకా ప‌నులు ప్రారంభించని ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు.

CRDA Ministers Sub Committee meets,take key decisions on land distribution

అలాగే బాబు జ‌గ‌జ్జీవ‌న్ రాం స్మృతివ‌నానికి 10 ఎక‌రాలు, ఇండియ‌న్ ఆర్మీకి 4 ఎక‌రాలు, చండ్ర రాజేశ్వర రావు ట్రస్ట్‌కు 3 ఎక‌రాలు, ఇషా ఫౌండేష‌న్‌కు 10 ఎక‌రాల చొప్పున కేటాయింపుల‌కు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇలా 8 సంస్ధల‌కు 56 ఎక‌రాలు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.

వ‌చ్చే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో విట్, ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృత‌మ‌యి లాంటి సంస్థల‌కు మ‌రో 100 ఎక‌రాల చొప్పున కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు.

English summary
Several key decisions have been made regarding the land allotment at ministerial sub committee meeting held on Thursday on CRDA. These details were disclosed to media by the Municipal Minister Narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X