వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌లపై...అమ్మాయిలకు అవగాహన:ఎస్పీ అశోక్‌కుమార్‌

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం:గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌లపై అమ్మాయిలకు అవగాహన పెంచాలని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. మహిళా రక్షక్‌ బృందాల పనితీరుపై ఆయన సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

అలాగే ఫోక్సో చట్టంపై కూడా అవగాహన పెంచాలన్నారు. దీనికోసం కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి చట్టాల గురించి వివరించాలన్నారు. మహిళా రక్షక్‌ బృందాలు, మహిళా పోలీసు వలంటీర్లు సంయుక్తంగా పని చేయాలన్నారు. మహిళా రక్షక్‌ బృందాలు జిల్లాలో నిఘా ఉంచి 57 మంది ఆకతాయిలను గుర్తించారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

 Creat Awareness over Good touch and Bad touch to girls:SP Ashok Kumar

జిల్లాలో ఇప్పటివరకు 55 ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి...గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌లపై అవగాహన కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర 116 ప్రాంతాల్లో నిఘా ఉంచామన్నారు. అనంతపురం సబ్‌ డివిజన్‌లో 17 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఆయన వివరించారు.

ఈ క్రమంలో ఒకరిపై కేసు నమోదు చేశామన్నారు. ధర్మవరంలో 21 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఆరు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. పుట్టపర్తిలో ఆరు చోట్ల, పెనుకొండలో 8 చోట్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. కదిరి సబ్‌ డివిజన్‌లో 10 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.

English summary
Anantapur district SP Ashok kumar said that to creat awareness over good and bad touches to girls. He held a review meeting on Saturday with respective officials on the performance of women's Rakshaks teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X