కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటెత్తిన తుంగభద్ర: సుంకేశుల గేట్లు ఎత్తివేత..శ్రీశైలానికి మరింత వరద ప్రవాహం

|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా వరప్రదాయినిగా పేరున్న తుంగభద్ర నది పోటెత్తుతోంది. ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన బ్యారేజీ జల హోరును సంతరించుకుంది. వరదనీరు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో జిల్లా భారీ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం ఈ ఆనకట్ట గేట్లను ఎత్తివేశారు. మొత్తం 30 గేట్లు ఉన్న ఈ ఆనకట్టకు సంబంధించిన 26 గేట్లను అడుగు మేర పైకి ఎత్తివేశారు. 2,10,000 క్యూసెక్కుల తుంగభద్ర నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. మరో 1500 క్యూసెక్కుల జలాలను కర్నూలు-కడప కెనాల్ కు వదిలారు. ఫలితంగా- ఈ రెండు జిల్లాల్లో పంట పొలాలు జలాలతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని కలెక్టర్ జీ వీరపాండ్యన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఎగువన ఉన్న కర్ణాటకలో తుంగ, భద్ర నదీ తీర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ రెండు నదుల్లో వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీనితో కర్ణాటకలోని హొస్పేట వద్ద నిర్మించిన టీబీ డ్యామ్ నుంచి దిగువకు జలాలను వదిలి వేస్తున్నారు. ఆ ప్రవాహం వల్ల జిల్లాలో సుంకేశుల వద్ద నిర్మించిన ఆనకట్ట నిండిపోయింది. సోమవారం రాత్రికి 2,15,000 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో నమోదైంది. మంగళవారం ఉదయానికి ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు.

Crest gates of Sunkesula barrage in Kurnool District of Andhra Pradesh lifted on Tuesday
Crest gates of Sunkesula barrage in Kurnool District of Andhra Pradesh lifted on Tuesday

దీనితో బ్యారేజ్ కు చెందిన 26 అడుగు మేర ఎత్తారు. దిగువన శ్రీశైలం రిజర్వాయర్ కు 2,10,000 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, కర్నూలు-కడప కెనాల్ కు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఫలితంగా- శ్రీశైలానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కర్నూలు పట్టణంలోకి ప్రవేశిస్తున్నాయి. కర్నూలు ఓల్డ్ టౌన్, జొహరాపురం, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాలలోకి బ్యాక్ వాటర్ ప్రవేశించాయి. ఇప్పటికే జొహరాపురం-ఓల్డ్ టౌన్ మధ్య వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.

English summary
Crest gates of Sunkesula Barrage in Kurnool District was lifted on Tuesday by the Official of the District Administration. The Barrage was constructed on Tunga Bhadra river. Around 2,10,000 Cu secs flood water released for down stream. Collector G Veerapandian was supervising the flood situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X