• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

క్రికెట్.. విద్యార్థి ప్రాణం తీసింది.. తోటి స్నేహితుడే దారుణంగా..!

|

విశాఖపట్నం : బడి ఈడు పిల్లల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. అయిందానికి, కానిదానికి తోటి విద్యార్థులతో గొడవలు పడుతున్న సందర్భాలు అనేకం. స్నేహితుల మధ్య ఘర్షణలు తలెత్తి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వస్తోంది పరిస్థితి. అదే క్రమంలో విశాఖపట్నంలో వెలుగుచూసిన ఘటన తల్లిదండ్రుల్లో భయాందోళన పుట్టిస్తోంది.

పాత కరాసాకు చెందిన మర్బార్కి రామారావు 13 సంవత్సరాల కొడుకు విజయ్ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం నాడు బక్రీద్ సందర్భంగా సెలవుదినం కావడంతో ఇంటి దగ్గర్లోని ప్లే గ్రౌండ్‌కు ఆడుకునేందుకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాడు. విజయ్ ఒక టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. అదే ప్రాంతానికి చెందిన చిన్న సాయి అనే బాలుడు వేరే గ్రూపుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

cricket playing cause to student death in visakhapatnam

వామ్మో.. లంచం స్టైల్ మార్చారుగా.. కరెన్సీ ముట్టకుండా తెలివిగా..!

జట్లుగా విడిపోయి ఆట మొదలెట్టారు. ఆ క్రమంలో విజయ్ టీమ్ రెండు మ్యాచుల్లో గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్ విజయావకాశాలు కూడా విజయ్ టీమ్‌కే ఉండటంతో సాయి రెచ్చిపోయాడు. చిన్న విషయానికే రాద్ధాంతం చేస్తూ విజయ్‌తో గొడవకు దిగాడు. అది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. ఆ క్రమంలో విజయ్ కడుపులో పిడిగుద్దులు గుద్దాడు సాయి. అంతేకాదు బ్యాట్‌తో కూడా కొట్టినట్లు తోటి స్నేహితులు చెబుతున్న మాట. సాయి దెబ్బలతో విజయ్ మైదానంలో పడిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఫ్రెండ్స్ సాయంతో ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి చేరుకున్న విజయ్ కడుపునొప్పంటూ బాధపడటంతో పేరేంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి మందులు ఇచ్చినా లాభాం లేకుండా పోయింది. కడుపునొప్పి తీవ్రం కావడంతో మంగళవారం రాత్రి చనిపోయాడు. క్రికెట్ ఆట కారణంగా గొడవకు దారి తీసి విజయ్ ప్రాణాలు కోల్పోవడంతో పాత కరాసాలో విషాదం నెలకొంది. కడుపు లోపలి భాగంలో దెబ్బలు గట్టిగా తగలడంతోనే తమ పిల్లోడు మరణించాడని ఆరోపిస్తూ.. స్థానిక ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
13 year old son Vijay of Marbarki Rama Rao of Visakhapatnam Old Karasa is studying in 8th grade. However, on Monday, a holiday occurred during Bakrid, when cricket was playing in the playground near the house. Sai, a boy from the other team, attacked with bat on vijay. He died on Tuesday night after being hit in the stomach by sai. Parents have complained at the local airport police station that their son died after suffering severe burns to the inside of the stomach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more