వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేని లెక్కలతో గారడీనా?: ఎక్కడినుంచి తీసుకొస్తారు? ఏపీ 'బడ్జెట్'పై విమర్శలు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలు గాల్లో లెక్కలేసినట్టే ఉందని అధికార వర్గాలే వాపోతున్నాయని అంటున్నారు. కేంద్రం పైసా విదల్చని వాటికి కూడా బడ్జెట్ లో భారీ కేటాయింపులు జరపడం.. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప మరొకటి కాదంటున్నారు.

Recommended Video

Irrigation Projects situation in Andhra Pradesh రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ !
 రెవెన్యూ లోటు లెక్కలివి?

రెవెన్యూ లోటు లెక్కలివి?

కేంద్రం నుంచి అందాల్సిన నిధులు రాష్ట్రానికి అంతగా అందడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. రెవెన్యూ లోటుకు సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.138కోట్లను మాత్రమే భర్తీ చేస్తామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర బడ్జెట్ లో మాత్రం కేంద్రం నుంచి రూ.12,099 కోట్లు వస్తాయని ప్రతిపాదించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 రాజధాని విషయంలోనూ

రాజధాని విషయంలోనూ

ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూడా కేంద్ర బడ్జెట్ లో పైసా దక్కలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం రూ.1000కోట్లు రాజధాని నిర్మాణం కోసం కేటాయించిందని బడ్జెట్ లో ప్రతిపాదించడం గమనార్హం. లేని లెక్కలను తీసుకొచ్చి బడ్జెట్ లో చేర్చి మనల్ని మనమే మోసం చేసుకోవడం కాదా ఇది? అని ఉన్నతాధికారులే వాపోతున్నట్టు చెబుతున్నారు.

ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబుఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

వెనుకబడిన జిల్లాలకు

వెనుకబడిన జిల్లాలకు

ఇక రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు కేంద్ర బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మాత్రం కేంద్రం నుంచి రూ.350 కోట్లు ప్రతిపాదించారు. అలాగే పన్నులకు సంబంధించి రాని నిధులను కూడా లెక్కలో చేర్చడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పోలవరం పరిస్థితి కూడా అంతే..

పోలవరం పరిస్థితి కూడా అంతే..

పోలవరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు విమర్శలకు తావిచ్చేవిగానే ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్ర బడ్జెట్ లో పోలవరం కోసం ఒక్క పైసా కేటాయించలేదు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాజా బడ్జెట్ లో పోలవరానికి రూ.9000కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే ఇలాంటి తప్పుడు లెక్కల వల్ల రాష్ట్రానికి ఒనగూరేది ఏమి లేదని, ఇవన్నీ కేవలం టీడీపీ ప్రచారాలకే పనికి వస్తాయని అంటున్నారు.

బ‌డ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులు:భారీ కేటాయింపులు కాదు...కోతలే...ఇదీ నిజం!బ‌డ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులు:భారీ కేటాయింపులు కాదు...కోతలే...ఇదీ నిజం!

English summary
Oppostion parties are not happy with TDP Budget for 2018, they alleged there are somany economical mistakes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X