వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కార్యదర్శికి సీఎస్ షోకాజ్ నోటీసులు: ఆ ఉత్తర్వులెలా ఇచ్చారు: ప్రభుత్వంలో కలకలం..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర చరిత్రలో తొలిసారి. రాష్ట్ర పరిపాలనాధికారి ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం ఇప్పుడు ప్రభుత్వం కలకలానికి కారణమైంది. ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటుగా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి కి ఎలాంటి స‌మాచారం లేకుండా.. స‌ర్వీస్ రూల్స్ మార్పులు- చేర్పులు కూ సంభందించిన విష‌యంలో ఏలాంటి ఫైల్ ర‌న్ చేయ‌కుండానే ప్ర‌వీణ్ ప్ర‌కాష్ స‌చివాల‌యం స‌ర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

దీని పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా.. ప్రవీణ్ ప్రకాశ్ ఏ విధంగా జీవో జారీ చేస్తారని ఉన్నతాధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో..ఈ మొత్తం వ్యహారం పైన వివరణ కోరుతూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నేరుగా ప్రవీణ్ ప్రకాశ్ కు నోటీసులు జారీ చేసారు.

సీఎం కార్యదర్శికి సీఎస్ నోటీసులు..

సీఎం కార్యదర్శికి సీఎస్ నోటీసులు..

సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి.. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్ర‌కాష్ కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం నోటీస్ లు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం స‌చివాల‌యం స‌ర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ జిఎడిముఖ్య కార్య‌ద‌ర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ జీవో జారీ చేసారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను ముఖ్యమంత్రి జగన్ తన ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు.

దీంతో పాటుగా సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలను అప్పగించారు. అయితే, కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి కి ఎలాంటి స‌మాచారం లేకుండా.. స‌ర్వీస్ రూల్స్ మార్పులు..చేర్పులకు సంభందించిన విష‌యంలో ఏలాంటి ఫైల్ ర‌న్ చేయ‌కుండానే ప్ర‌వీణ్ ప్ర‌కాష్ స‌చివాల‌యం స‌ర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.. ఇదే రాష్ట్ర ప్ర‌భుత్వంలో, ఐఎయ‌స్ ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. దీని పైనే సీఎస్ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ కు నోటీసులు జారీ చేయటానికి కారణమైంది.

మంత్రివర్గ ఆమోదం ఉండాలంటూ..

మంత్రివర్గ ఆమోదం ఉండాలంటూ..

స‌ర్వీస్ రూల్స్ మార్పులు చేర్పులు చేయాలంటే త‌ప్ప‌ని స‌రిగా మంత్రి వ‌ర్గం అమోదం ఉండాలని ఉన్న‌తాధికారులు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు..ఆదేశాల అమలుకు సంబంధించి బిజినెస్ రూల్స్ మారుస్తూ..వాటి అమలు కోసం నిర్ణీత సమయాన్ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్ర‌వీణ్ ప్ర‌కాష్ జారీ చేసిన ఈ జీవో నిభంద‌న‌ల‌కు విరుద్దం సీనియ‌ర్ ఐఎయ‌స్ అధికారులు అంటున్నారు.

విధివిధానాలు పాటించకుండా కేబినెట్‌ అజెండాలో అంశాలు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పెషల్‌ సీఎస్‌ స్థాయి అధికారులకు సైతం సీఎం సూచనల మేరకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని తనకు దఖలు పరుచుకున్నారని అధికారులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చ లేకుండా..ఇలా తనకు తానుగా జీవో జారీ చేయటం పైన సీనియర్ ఐఏయస్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రవీణ్ ప్రకాశ్ సమాధానం కోసం..

ప్రవీణ్ ప్రకాశ్ సమాధానం కోసం..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు తెలియకుండా..చర్చింకుండా ఇలా జీవో జారీ చేయటం పైన అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. తన అధికారాలను ప్రశ్నించటమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ను వివ‌ర‌ణ కోరుతూ సియ‌స్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం నోటిసులు జారీ చేశారు.సియ‌స్ ఇచ్చిన నోటీస్ కు మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవహారం పైన అంతర్గతంగా ప్రభుత్వంలో చర్చ సాగుతోంది. సీఎస్.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి మధ్య ఇప్పుడు అధికార వివాదం తలెత్తటం..ఏకంగా సీఎస్ నోటీసులు ఇవ్వటం పైన ఇప్పుడు అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా సీఎస్ చేసిన పని సరైనదే అయినా..ఇది అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాల్సిన అంశమని సీనియర్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఇక, దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
New dispute araised betwee key officials in AP Govt. CS LV Subaramanyam issued notices to CM special secretary Praveen Prakash on issuing of order with change of business rules. With out C.S knowledge he issued Go, Now this issue became controversy in AP Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X