వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడపలో అన్నదాతకు కష్టం: ప్రకాశంలో తాగునీటి వెతలు

ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తున్నా కడప, ప్రకాశం జిల్లాల ప్రజలు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. కడప జిల్లాపై వరుణుడు పగ బట్టాడా? అన్నట్లు వరుస కరువు జిల్లాను పట్టి పీడిస్తోంది. ఖరీఫ్‌ గడువు దగ్గర పడ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తున్నా కడప, ప్రకాశం జిల్లాల ప్రజలు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. కడప జిల్లాపై వరుణుడు పగ బట్టాడా? అన్నట్లు వరుస కరువు జిల్లాను పట్టి పీడిస్తోంది. ఖరీఫ్‌ గడువు దగ్గర పడుతున్నా ఇప్పటికీ వర్షాభావంతో నామమాత్రంగానే పంటలు సాగు చేశారు.

సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా వాటిలో నీరు లేదు. కృష్ణా జలాలు జిల్లాలో ఈ ఏడాది పారే పరిస్థితి కనిపించడంలేదు. నదులన్నీ ఎండిపోగా. చెరువుల్లో చుక్కనీరు లేక నెర్రెలు బారాయి. జిల్లాలో 1,36, 673 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు.

బోర్ల కింద పంటలు సాగు చేసుకున్నా భూగర్భ జలాలు అడుగంటడంతో రైతు అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వేరుశనగ రైతు పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దుక్కులు పూర్తైనా వర్షాలు రాకపోవడంతో విత్తనం గింజలు ఇళ్లలోనే మగ్గుతున్నాయి.

కడపకు తప్పని కరువు

కడపకు తప్పని కరువు

జిల్లాలోని 50 మండలాలకు 17 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 27 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. రెండు మండలాల్లో తీవ్ర లోటు ఏర్పడింది. 5 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువగా నమోదైంది. గత ఏడాది జూన్‌లో 127 మిల్లీమీటర్లు, జూలైలో 120.8 మిల్లీమీటర్లు, ఆగస్టులో 44.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. అయితే గతేడాది చివరలో వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయి కరువు తప్పలేదు. ఈ ఏడాది అంతకంటే విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 15 ఏళ్లలో ఇలాంటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదని వ్యవసాయ శాఖధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు అనంతపురంలో సమావేశమైనప్పుడు కడప కరువుపై ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగుకు మండలాల వారీగా అధ్యయనం చేస్తున్నారు.

 ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా వరుణుడు కరుణించాల్సిందే

ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా వరుణుడు కరుణించాల్సిందే


ఇతర జిల్లాల్లో లేనన్ని సాగునీటి ప్రాజెక్టులు కడప జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికి పూర్తయిన ప్రాజెక్టుల్లోనే 90 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇందులో తెలుగుగంగ, గాలేరు - నగరి ప్రా జెక్టుల కింద బ్రహ్మంసాగర్‌, గండికోట ప్రాజెక్టులు ప్రదానమైనవి. ఇవి కాక కేసీ కెనాల్‌ లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టుల కింద ఈసారి సాగు ప్రశ్నార్థకంగా మారింది. వీటికి అదనంగా శ్రీశైలం నుంచి నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా ఉన్నది. జిల్లాలో కరువు కాటకాలు ఎదురైనప్పుడు న దులు, ఏటి పరీవాహక ప్రాంతాలు రైతుకు భరోసా కల్పించేవి. పెన్నా, చెయ్యేరు, కుందూ, చిత్రావతి, పాపాగ్నిలతో పాటు సగిలేరు, బాహుదా తదితర నదులు ఉన్నాయి. ఈ ఏడాది ఈ నదులన్నీ ఎండిపోయాయి.

ఉపశమనం కలిగించని వర్షాలు

ఉపశమనం కలిగించని వర్షాలు

తాగునీటి కోసం ప్రకాశం జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలు ఖరీఫ్‌ పైర్లకు కొంత జీవం పోశాయి. జిల్లాలోని మొత్తం 56 మండలాల్లో 10 మండలాల్లో భారీ వర్షాలు, మరో 30 మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. మరో 16 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెల తొలివారం వరకు పంటల సాగుపై నీలిమేఘాలు కమ్ముకోగా, వేసిన పంటలు కూడా వాడిపోయాయి. తాజా వర్షాలతో ఆ పంటలు జీవకళ సంతరించుకున్నాయి. ప్రకాశం జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడి నుంచి మాత్రం తాజా వర్షాలు ఉపశమనం కలిగించలేకపోయాయి.

ప్రకాశంలో ఇలా తాగునీటి సమస్య

ప్రకాశంలో ఇలా తాగునీటి సమస్య

దీనికి తోడు సాగునీరు కూడా విడుదల కాకపోవడంతో 292 చెరువులలో దాదాపు 140 చెరువులు ఎండిపోగా, మరో 100 చెరువులు అడుగంటాయి. పట్టణాలకు సాగర్‌ నీటిని తాగునీరు అందించే పలు ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో చుక్కనీరు కరువైంది. అటు నాగార్జున సాగర్‌ నీరు కాక, ఇటు వర్షపు నీరు చేరక ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని 35 మండలాల్లో 386 గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఐదురోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 10 రోజులు దాటితే అవి కూడా ఇచ్చే అవకాశం లేదు. నాగార్జున సాగర్‌ నీరే ఆధారమైన మార్కాపురం పట్టణంలోని 8వేల కొళాయిలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా రోజుకు 250 ట్రిప్పుల వంతున ట్యాంకర్‌లతో నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

English summary
Cudapa and Prakasam districts were facing water problems in Andhra Pradesh. Cudapa has to face drought straight second year. So many irrigation projects here but there no storage of water. Another side Prakasam district has facing drinking water problem while in Ongole once 5 days only water supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X