విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ కఠినతరం ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇక నేడు ఏపీలో కొత్తగా మరో 12 కేసులు నమోదు కాగా 161కు బాధితుల జాబితా చేరింది . ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు . ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు.

ఉల్లి రైతులను కన్నీరు పెట్టిస్తున్న కరోనా ... రైతన్నకు ఊహించని కష్టంఉల్లి రైతులను కన్నీరు పెట్టిస్తున్న కరోనా ... రైతన్నకు ఊహించని కష్టం

మొదట అక్కడక్కడ నమోదైన కరోనా కేసులు గత రెండు మూడు రోజుల్లో ఊహించని విధంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో ముఖ్యంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని కఠినం గా అమలు చెయ్యాలని భావిస్తున్నారు. విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. బెజవాడలో ఇప్పటి వరకు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు . దీంతో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త పేట ఇలా నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

Curfew tightened in those areas in Vijayawada .. the reason is

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవసరం అయినా హెల్ప్ లైన్ ను సంప్రదించాలని, బయటకు మాత్రం రావద్దు అని చెప్తున్నారు పోలీసులు . ఇక కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని కమిషనర్ చెప్పారు. అంతే కాదు మూడు కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇక ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు .

English summary
In Vijayawada, curfew is prevalent in areas where corona is high. Officials have been alerted to 18 corona positive cases so far in vijayawada. Officials announcing the high alert imposed curfew in four areas - Bhavanipuram, Autonagar, Old Rajarajeshwaripeta and kottha Peta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X