వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స టౌన్లో కర్ఫ్యూ: గంటలో చకచకా పనులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయనగరం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకా విజయనగరంలో మంగళవారం గంటపాటు కర్ప్యూను సడలించడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కున్నారు. ఐదు రోజులుగా విజయనగరంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కర్ఫ్యూ విధించారు. మంగళవారం గంట పాటు కర్ఫ్యూను సడలించారు.

ప్రజలు శాంతి భద్రతలను నెలకోల్పేందుకు తమతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం సాయంత్రం తన బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోరారు. ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నందున కర్ఫ్యూ సడలింపును పొడిగించినట్టు తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఒకవేళ ఎవరైనా దాడులకు పాల్పడితే కర్ఫ్యూ సడలింపులో మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. మరోవైపు రైతు బజార్లలో కూరగాయలు అధిక ధరలకు విక్రయించిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. కూరగాయలను అధిక ధరలకు విక్రయించకుండా గట్టిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలకు అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విజయనగరం 1

విజయనగరం 1

విజయనగరం పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ కార్తికేయ చెప్పారు. అక్కడక్కడ సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మొత్తం మీద ప్రశాంతత నెలకొందన్నారు.

 విజయనగరం

విజయనగరం

ప్రజలు శాంతిభద్రతలను నెలకోల్పేందుకు తమతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం తన బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నందున కర్ఫ్యూ సడలింపును పొడిగించినట్టు తెలిపారు.

 విజయనగరం

విజయనగరం

బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరైనా దాడులకు పాల్పడితే కర్ఫ్యూ సడలింపులో మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.

 విజయనగరం

విజయనగరం

మూడు రోజులుగా విజయనగరంలో కర్ఫ్యూ పరిస్థితి దృష్ట్యా జనం విలవిలలాడారు. బంద్‌ల పేరిట కొన్ని రోజులు, కర్ఫ్యూ పేరిట కొన్నిరోజులు దుకాణాలు మూత పడడంతో వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

 విజయనగరం

విజయనగరం

ప్రతిరోజూ ఐదుకోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగే వ్యాపారులకు గత రెండు నెలలుగా వ్యాపారాలు సక్రమంగా జరగలేదు. దాంతో పాటు కర్ఫ్యూ విధించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తమ పరిస్థితి తయారైందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

 విజయనగరం

విజయనగరం

జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకొంది. ఒకపక్క బంద్‌లు, కర్ఫ్యూలతో ఇబ్బందులు పడుతున్న జనానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 విజయనగరం

విజయనగరం

మంచినీరు నిలిచిపోయినా దూరంగా ఉన్న బోర్లకు గాని, బావుల వద్దకు గాని వెళ్ళాలని సాహసించినా పోలీసులు లాఠీలు ఝళిపిస్తారని భయంతో ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు.

 విజయనగరం

విజయనగరం

జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకొంది. ఒకపక్క బంద్‌లు, కర్ఫ్యూలతో ఇబ్బందులు పడుతున్న జనానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 విజయనగరం

విజయనగరం

జిల్లా అంతటా విద్యుత్ నిలిచిపోవడంతో టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పెట్రోలు బంకుల్లో వాహనదారులు క్యూ కట్టిన దృశ్యం.

 విజయనగరం

విజయనగరం

బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరైనా దాడులకు పాల్పడితే కర్ఫ్యూ సడలింపులో మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.

 విజయనగరం

విజయనగరం

రైతుబజార్లలో కూరగాయలు అధిక ధరలకు విక్రయించిన విషయం తన దృష్టికి వచ్చిందని, కూరగాయలను అధిక ధరలకు విక్రయించకుండా గట్టిగా ఆదేశాలు జారీ చేశామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

English summary
Curfew in Vizianagaram town was eased for an hour on Tuesday morning after normalcy began to return in the violence-hit area even as strict vigil was being maintained during the relaxation period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X