వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు రిలీఫ్ దొరికేనా: నేడు కీలక విచారణ: నిర్ణయం పై ఉత్కంఠ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధించిన విధంగా కోర్టు హాజరు అంశంలో రిలీఫ్ దొరుకుతుందా లేదా..ఇప్పుడు ఇదే అంశం ఉత్కంఠకు కారణమవుతోంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోద చేసిన అభియోగాల కేసుల్లో జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. అయితే, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ వారం కోర్టుకు హాజరు కావలంటే ఎదురయ్యే ఇబ్బందులను కోర్టుకు నివేదించిన జగన్.. తనకు కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని..తన స్థానంలో తన న్యాయవాది హాజరవుతారని కోర్టులో పిటీషన దాఖలు చేసారు.

అయితే..దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ పేజీల కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కు కోర్టు హాజరీ నుండి మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది..దీనికి అనుమతించవద్దని సీబీఐ కోర్టును కోరింది. దీని పైన ఈ రోజు మరోసారి కోర్టులో విచారణకు రానుంది. దీంతో..కోర్టు జగన అభ్యర్ధన..సీబీఐ అభ్యంతరాల నడుమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సారీ సునీల్! సహోద్యోగుల శారీరక, మానసిక వేధింపులతో భెల్ మహిళా ఉద్యోగిని ఆత్మహత్యసారీ సునీల్! సహోద్యోగుల శారీరక, మానసిక వేధింపులతో భెల్ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

సీబీఐ జగన్ మీద నమోదు చేసిన కేసుల్లో విచారణ నిమిత్తం గతంలో ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యేవారు. అయితే, ఎన్నికల్లో గెలవటం.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తాను ప్రతీ వారి కోర్టుకు హాజరవ్వాలంటే ఎదురయ్యే సాధకబాధకాల గురించి జగన్ కోర్టుకు నివేదించారు. తనకు ప్రతీ వారం కోర్టుకు హాజరు కాకుండా అనుమతి ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్దించారు.

curiosity created on court proceedings and decison on CM jagan petition

తాను సీఎం హోదాలో కోర్టుకు హాజరైతే అసలే అర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పైన మరింత భారం పెరుగుతుందని..పాలనా వ్యవహారాల మీద సమయం కేటాయించాల్సి ఉంటుందని..తన స్థానంలో తన న్యాయమూర్తి హాజరవుతారని చెబుతూ..కోర్టు నిర్ధేశించిన సమయంలో తాను హాజరవుతానని నివేదించారు. దీని పైన కోర్టు సీబీఐ అభిప్రాయం కోరగా..సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో కౌంటర్ దాఖలు చేసారు. అందులో జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని..ఆయనకు కోర్టు హాజరకు మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.

గతంలోనూ ఈ రకంగా ప్రయత్నాలు జరిగాయని కౌంటర్ లో పేర్కొంది. దీని పైన విచారణ చేసిన కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు సైతం ఇదే అంశం పైన జగన్ తరపు న్యాయవాదితో పాటుగా సీబీఐ న్యాయవాది సైతం తమ వాదనలను కోర్టు ముందు వినిపించనున్నారు. ఆ తరువాత కోర్టు సీఎం జగన్ పిటీషన్ పైన నిర్ణయం తీసుకోనుంది. దీంతో..కోర్టు ఏ రకంగా స్పందిస్తుందనే అంశం పైన అటు రాజకీయంగా..ఇటు అధికార వర్గాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది.

English summary
arguments may continue to day also in CBI court on JAgan petion for accepetence of absence. CBI filed counter agianst jagan petition and objected his request. curiosity created on to day court decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X