హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండుగలు: మత పెద్దలకు కమిషనర్ వార్నింగ్(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భక్తి శ్రధ్దలతో దసరా, బక్రీద్ పండుగను జరుపుకోవాలని సైబరాబాద్ కమీషనర్ సివి. ఆనంద్ తెలిపారు. హిందూ, ముస్లిం మత పెద్దలతో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరపుకున్నట్లుగా... దసరా, బక్రీదు పండుగలను ఎలాంటి ఘర్షణలకు దిగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.

ఎవరైనా గొడవకు దిగితే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ రోజు తమ పండుగను ప్రశాంతంగా జరపుకోనివ్వకుండా గో సంరక్షణా సమితి, భజరంగ్ దళ్, బేజీపి కార్యకర్తలు అడ్డుకోద్దని, మేము హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తామని అన్నారు.

బక్రీద్ పండుగ నాడు ముస్లింల ఆధ్వర్యంలో గోవధ జరగటం లేదని, బక్రీద్ నాడు గొర్రెలను, మేకలను మాత్రమే వధిస్తామని అన్నాడు. ఇతర జిల్లాల నుండి నగరానికి తరలివస్తున్న గోవుల్ని బయటకి రానివ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, ఆ గోవుల్ని సక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

గోవుల రవాణా అక్రమంగా జరుగుతోందని, అలా జరగకుండా నిరోధించి గోసంరక్షణ చేపట్టాలని హిందూ కార్యకర్తలన్నారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

దీనికి తమ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హిందూ మత పెద్దలు అన్నారు. ముస్లింలపై తమకు కోపం లేదని, వారు తమకు అన్నదమ్ములాంటి వారని, కానీ పూజించే గోవులను వధించడం అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

కమీషనర్ మాట్లాడుతూ గో సంరక్షణ సమస్యను అధిగమించడానికి 22 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

డిజిపి ఆదేశాల మేరక తెలంగాణలోని ఇతర జిల్లాలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేసి గోవులను తిరిగి వెనక్కి పంపే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సైబరాబాద్ కమీషనర్ తెలిపారు.

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

ప్రతిజోన్‌కు ఒక క్యాటల్ హోల్డింగ్ ఏర్పాటు చేయండ జరిగిందని ఈ చెక్ పోస్టులు ఎస్ ఐ ఆధ్వర్యంలో నడుస్తాయని గోవులను తరలించే వాహనాలను వెటర్నరీ డాక్టర్ చెకప్ చేసి తరువాత తిరిగి పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

ఎవరూ కూడా చట్టాన్ని తమ అదుపులోకి తీసుకోరాదని గుంపులుగా తిరిగి అలజడి సృష్టించవద్దని హెచ్చరించారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

సంతల్లో గోవులను, దూడలను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.

 హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

గ్రామాల్లో గోవులను అమ్మనివ్వకుండా అధికారులు కార్యకర్తలు చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు కమీషనర్ తెలిపారు.

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

హిందూ, ముస్లిం మత పెద్దలతో కమీషనర్ సివి. ఆనంద్

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కమీషనర్ సివి. ఆనంద్, జాయింట్ కమీషనర్ వై. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
cyberabad commissioner cv anand about dussehra and bakrid. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X