వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్‌ ప్లేస్టోర్‌..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్‌ కేసులో కొత్త మ‌లుపులు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో మొద‌లైన పొలిటిక‌ల్ వార్‌..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబారాబాద్ క‌మిష‌న‌ర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది . తెలంగాణ ప్ర‌భుత్వ అడుగులకు అనుగుణంగా గ‌ట్టిగా స్పందించాల‌ని నిర్ణ‌యించింది.

అశోక్ కోసం గాలింపు..

అశోక్ కోసం గాలింపు..

ఐటి గ్రిడ్స్ లో ఇప్ప‌టిక ప‌లు ద‌ఫాలుగా సోదాలు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు సంస్థ నిర్వ‌హ‌కుడు అశోక్ కోసం గా లింపు తీవ్ర‌త‌రం చేసారు. అశోక్ ఏపిలోనే ఉన్నార‌ని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న విదేశా ల‌కు వెళ్ల‌కుండా లెక్ ఔట్ నోటీసులు జారీ చేసారు. ఆయ‌న‌కు ఇచ్చిన స‌మ‌యం ముగిసింద‌ని చెబుతున్న పోలీసులు ఆయ‌న ఎక్క‌డున్నా అదుపులోకి తీసుకుంటామంటున్నారు. ఆయ‌న‌కు సైబ‌రాబాద్ పోలీసులు త‌మ సంస్థ లో సోదా ల కోసం వ‌స్తున్నార‌ని తెలిసి ముందుగానే హార్డ్ డిస్క్ లు స‌ర్వ‌ర్ ల తో వెళ్లిపోయారని..ఆయ‌న క‌ద‌లిక‌ల పై నిఘా పెట్టామ‌ని పోలీసులు చెప్పారు. ఇక‌, ఆయ‌న కోసం ప్ర‌త్యేకంగా నాలుగు పోలీసు బృందాలు గాలింపు ప్రారంభించాయ ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో..ఆయ‌న వ‌ద్ద డేటా లేక‌పోవ‌తే త‌ప్పించుకోవాల్సిన అవ‌సరం ఏంట‌నే చర్చ కూడా మొద‌లైంది.

అమెజాన్ ..గుగూల్ కు ఇప్ప‌టికే నోటీసులు

అమెజాన్ ..గుగూల్ కు ఇప్ప‌టికే నోటీసులు

ఐటీ గ్రిడ్స్ లో టిడిపి కోసం త‌యారు చేసిన సేవామిత్ర యాప్ కు సంబంధించిన స‌మాచారం..అదే విధంగా అరోప‌ణ లు వ‌స్తున్న‌ట్లుగా ఏపి ప్ర‌జ‌ల డేటా సంస్థ వ‌ద్ద ఏ ర‌కంగా ఉంది అనే అంశం పై పోలీసులు లోతుగా అధ్య‌య‌నం చేస్తు న్నారు. దీని పై ఫోరెన్సిక్ తో పాటుగా సైబ‌ర్ క్రైం పోలీసులు రంగంలోక దిగారు. ఇదే స‌మ‌యంలో ఐటీ గ్రిడ్స్ సంస్థ త‌మ డేటా మొత్తాన్ని అమెజాన్‌...గుగూల్ క్లౌడ్ వెబ్ లో ఉంచిన‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో..ఒకవైపు అశోక్ కోసం గాలింపు సాగిస్తూనే.. మ‌రో వైపు అమెజాన్..గుగూల్ సంస్థ ల‌కు నోటీసులు జారీ చేసారు. ఆ సంస్థలు సైతం పోలీసులు అడిగిన స‌మాచారం ఇవ్వ‌టానికి రెండు రోజుల స‌మ‌యం కోరారు. వారిచ్చే స‌మాచారం ఇప్పుడు విచార‌ణ‌లో కీల‌కం కానుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

గుగూట్ ప్లే స్టోర్ నుండి స‌మాచారం..

గుగూట్ ప్లే స్టోర్ నుండి స‌మాచారం..

ఐటీ గ్రిడ్స్‌ కేసులో గూగుల్‌ ప్లేస్టోర్‌కు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ పూర్తి వివరాలతో పాటు.. ఈ యాప్‌ ఎప్పటి నుంచి గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.. ఎంతమంది డౌన్ లోడ్‌ చేసుకున్నారు.. ఎలాంటి పర్మిషన్లతో అనుమతులు ఇచ్చారు.. అనే ప్రశ్నలకు అధికారికంగా సమాధానాలు కావా లని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతోంది. డేటా వ్యవహారంలో తమ ముందు హాజరు కావాలని నోటీసులిచ్చినా ఇంతవరకు అశోక్‌ రాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అశోక్ ను త్వ‌రలోనే అరెస్ట్ చేస్తామ‌ని సైబ‌రాబాద్ పోలీసులు చెబుతున్నారు.

English summary
Cyberabad Police issued notices to Amazon, Google, Play store for AP Data which used by IT Grids company. Police searching for Ashok with special teams. Amazon and Google asked two days time to give information which asked by Cyberabad Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X