వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్..కేసీఆర్ భ‌విష్య‌త్ చెప్పారే: ఇలా దొరికిపోయారేంటి: పోలీసుల‌కు చిక్కిన హీరో గ‌రుడ శివాజీ..!

|
Google Oneindia TeluguNews

త‌న గరుడ పురాణంతో రాజ‌కీయాల్లో జ్యోతిష్యం చెప్పిన హీరో శివాజీ త‌న ప‌రిస్థితి అంచ‌నా వేయ‌లేక‌పోయారు. అలంద మీడియా కేసులో శివాజీని సైబ‌రాబాద్ పోలీసులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు నెల‌ల కాలంలో అజ్ఞాతంలో ఉన్న శివాజీ మ‌ధ్య‌లో వీడియో సందేశం ద్వారా తాను ఎక్క‌డికీ పారిపోలేదంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. కోర్టు ద్వారా ముంద‌స్తు బెయిల్ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. అయితే, అమెరికా వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలో తాము అదుపులోకి తీసుకున్నామ‌ని సైబరాబాద్ పోలీసులు ప్ర‌క‌టించారు.

కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహంలో అమిత్ షా .. ఎలా స్కెచ్ వేశారో తెలుసా !కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహంలో అమిత్ షా .. ఎలా స్కెచ్ వేశారో తెలుసా !

పోలీసుల అదుపులో హీరో శివాజీ

పోలీసుల అదుపులో హీరో శివాజీ

రెండు నెల‌ల క్రితం టీవీ9 కొనుగోలు వ్య‌వ‌హారంలో నాటి సంస్థ సీఈవో ర‌వి ప్ర‌కాశ్ తో పాటుగా హీరో శివాజీ సైతం అక్ర‌మాలు చేసారంటూ అలంద మీడియా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచార‌ణ సాగిస్తున్నారు. ఇదే క్ర‌మంలో శివాజీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. నెల రోజుల క్రితం వీడియా సందేశం ద్వారా తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని..వ‌డ‌దెబ్బ కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు ఆయ‌న విదేశాలకు వెళ్లే క్రమంలో చిక్కిన‌ట్లు సైబ‌రాబాద్ పోలీసులు చెబుతున్నారు. సినీ హీరోగా.. ఏపీ రాజ‌కీయా ల్లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా..గ‌రుడ పురాణం ఫేమ్‌గా శొంఠినేని శివాజీ ఫేమ‌స్ అయ్యారు.

కోర్టును గ‌తంలోనే ఆశ్ర‌యించినా..

కోర్టును గ‌తంలోనే ఆశ్ర‌యించినా..

త‌న పైన కేసు న‌మోదైన త‌రువాత శివాజీ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్ప‌టి నుండి పోలీసులు శివాజీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో త‌న పైన న‌మోదు చేసిన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ శివాజీ న్యాయ‌స్థానాన్ని సైతం ఆశ్ర‌యించారు. త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా స్గే ఇవ్వాల‌ని అభ్య‌ర్దించారు. దేశం దాటి వెళ్లిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుండ‌గా శివాజీని అదుపులోకి తీసుకున్నామ‌నివ‌..అయితే అరెస్ట్ చేయ‌మ‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల మేర‌కు సీఆర్పీసీ ప్ర‌కారం నోటీసులు జారీ చేశామ‌ని చెప్పుకొచ్చారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరామ‌ని.. శివాజీని నోటీసుల ఆధారంగా విచార‌ణ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టికే శివాజీ పై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఇదే కేసు లో టీవీ9 మాజీ సీఈవో ఇప్ప‌టికే సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు. అదే విభాగానికి చెందిన కార్యాల‌యానికి ఇప్పుడు శివాజీని సైతం త‌ర‌లించ‌టంతో ఆయ‌న్ను కూడా విచారించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్‌..కేసీఆర్ పైనా నాడు శివాజీ ఇలా..

జ‌గ‌న్‌..కేసీఆర్ పైనా నాడు శివాజీ ఇలా..

ఏపీ రాజ‌కీయాల్లో శివాజీ కొంత కాలంగా టీడీపీ మ‌ద్ద‌తు దారుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఏపీలో బీజేపీ ఏం చేయ‌బోతుందో అంచ‌నావేస్తూ అప‌రేష‌న్ గ‌రుడ పేరుతో వార్త‌ల్లో నిలిచారు. జ‌గ‌న్ పైన విశాఖ విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగిన టైంలో సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌యంగా శివాజీ చెప్పిన అప‌రేష‌న్ గ‌రుడ‌ను ప్ర‌స్తావించారు. ఇక జ‌గ‌న్ సీఎం కావాలంటే ముందుగా కేసులు కొట్టేయించుకోవాల‌ని..జ‌గ‌న్ విద్యార్హ‌త ఏంట‌ని..జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ఏం చేస్తార‌ని ప‌దేప‌దే ప్ర‌శ్నించేవారు. ఇక‌, కేసీఆర్‌-జ‌గ‌న్ మ‌ధ్య స్నేహం సైతం బంద‌రు పోర్టు కోస‌మేన‌ని ఆరోపించారు. కేసీఆర్ హైద‌రాబాద్‌లోని ఏపీ ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నార‌ని అనేక పార్లు ఆరోపించారు. ఎన్నిక‌ల ముందు సైతం టీడీపీ అధినేత చంద్ర‌బాబు వాద‌న‌కు మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్‌లో నివ‌స్తున్న ఏపీ ప్ర‌జ‌ల విష‌యంలో కేసీఆర్ పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఏపీలో తిరిగి చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేసేవారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత శివాజీ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తిరిగి ఇప్పుడు పోలీసుల అదుపులో బ‌య‌ట‌కు వ‌చ్చారు.

English summary
Cyberabad Police Taken cine Hero Sivaji in to their custody in Samshabad Airport. Alanda Media filed case on Sivaji in TV9 purchasing matter. Since two months Sivaji was in under ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X