శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని వేగం గంటకు 12 కిలోమీటర్లుగా నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దీని కదలికలు ఉన్నాయని చెప్పారు. ఫలితంగా- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ శ్రీకాకుళం జిల్లాలో ప్రచండవేగంతో గాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాఢాంధకారం నెలకొంది. కంటి మీద కునుకు లేకుండా గడిపారు ఆయా గ్రామాల ప్రజలు. సముద్రానికి సమీపంలో ఉన్న కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంత బొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, శ్రీకాకుళం తదితర మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

 Cyclone Fani landfall in Srikakulam district in Andhra Pradesh make way towards Odisha

ఒడిశా సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురంపై ఫొని తుఫాను పెను ప్రభావం పడింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సోంపేటలో గరిష్ఠంగా 10 సెంటీమీటర్ల. వర్షపాతం నమోదైంది. ముందుజాగ్రత్త చర్యగా చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. శ్రీకాకుళం, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కంచిలిలో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు.

తుఫాన్ ధాటికి అల్లకల్లోలం..

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినట్టే.. గురువారం రాత్రంతా భారీ వర్షాలు నమోదయ్యాయి. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంత రోడ్ల మార్గాలు కోసుకుపోయాయి. ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు ధ్వంసం అయ్యాయి.

 Cyclone Fani landfall in Srikakulam district in Andhra Pradesh make way towards Odisha

సూపర్ సైక్లోన్ గా రూపాంతరం

ఫొని తుఫాన్ ఒడిశా తీరానికి సమీపిస్తున్న కొద్దీ సూపర్ సైక్లోన్ గా ఆవిర్భవించిందని అధికారులు తెలిపారు. తీరాన్ని తాకిన సమయంలో అంచనాలకు మించిన విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీరాన్ని తాకిన సమయంలో 200 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని, ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒడిశాపై తుఫాన్ ప్రభావం పడింది. చిలుకా సరస్సు ప్రాంతం అతలాకుతలమౌతోంది.

English summary
cyclone Fani make landfall in Andhra Pradesh as make way to Odisha's Puri this morning, the state administration moved 11 lakh people to safety and advised the people to remain indoors. The storm is set to affect Odisha, Andhra Pradesh and West Bengal. According to the India Meteorological Department (IMD), the cyclone currently lies about 65 km from Gopalpur and 80 km from Puri in Odisha. Cyclone Fani - also pronounced as FONI -- will likely hit Odisha with maximum sustained wind speed of 170-180 kmph, which is expected to rise to 200 kmph. Almost 11 lakh people have been evacuated to temporary shelters in Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X