• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
LIVE

గర్జిస్తోన్న గులాబ్ తుఫాను: ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన

|

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌లా మారనుంది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. 2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ తరహాలో విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. దీని తీవ్రత తిత్లి తుఫాన్‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తోన్నారు. అదే స్థాయిలో అసాధారణ ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చడానికీ అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకుంది. వచ్చే 12 గంటల్లోగా పెనుతుఫాన్‌గా మారనుంది. తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ తుఫాన్‌కు గులాబ్‌గా పేరు పెట్టారు. పాకిస్తాన్ ఈ పేరును సూచించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు.

Cyclone Gulab Live updates in Telugu:North Coastal Andhra to witness Heavy rains

Newest First Oldest First
12:51 PM, 29 Sep
కోల్‌కతాలో భారీ వర్షాలు.జలమయమైన లోతట్టు ప్రాంతాలు
12:49 PM, 29 Sep
సైక్లోన్ గులాబ్ ఎఫెక్ట్: విజయనగరంలో మరో నలుగురు మృతి. 90శాతం ప్రాంతాల్లో తిరిగి ప్రారంభమైన విద్యుత్ సరఫరా
5:39 PM, 28 Sep
గులాబ్ తుఫానుతో ఉభయ గోదావరి జిల్లాలో పంటనష్టం
3:40 PM, 28 Sep
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలతో మూసీనదికి వరద పోటెత్తుతోంది.దీంతో మూసరాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలపై రాకపోకలు బంద్ అయ్యాయి
3:38 PM, 28 Sep
గులాబ్ తుఫాను ప్రభావం తెలంగాణలో కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా సగటున 136.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది
10:45 AM, 28 Sep
కృష్ణా శ్రీకాకుళం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
9:04 AM, 28 Sep
మహారాష్ట్ర
గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటిన తరువాత కూడా తీవ్రత తగ్గట్లేదు. తీవ్ర అల్పపీడనంగా మారిన తుఫాన్ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర ప్రాంతం, మరాఠ్వాడా, విదర్భ ఉపరితలపై విస్తరించి ఉంది. ఫలితంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన భారత వాతావరణ కేంద్రం. ముందుజాగ్రత్త చర్యగా ఒక బృందాన్ని మోహరింపజేసినట్లు తెలిపిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
8:40 AM, 28 Sep
తెలంగాణ
గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటిన తరువాత కూడా తీవ్రత తగ్గట్లేదు. తీవ్ర అల్పపీడనంగా మారిన తుఫాన్ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర ప్రాంతం, మరాఠ్వాడా, విదర్భ ఉపరితలపై కేంద్రీకృతమై ఉందని వెల్లడించిన భారత వాతావరణ కేంద్రం అధికారులు. దీని ప్రభావంతో వచ్చే ఆరు గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
1:28 AM, 28 Sep
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో సముద్రంలో నెలకొన్న అలజడి కారణంగా మత్య్సకారులెవరూ మంగళవారం సాయంత్రం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
12:51 AM, 28 Sep
పలు రైళ్లు రద్దు కావడంతో ఎటు వెళ్ళాలో తెలియక రైల్వే స్టేషన్ దగ్గరే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
10:57 PM, 27 Sep
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తన్న భారీ వర్షాలపై గవర్నర్‌ తమిళిసై ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో గవర్నర్ తమిళిసై ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యగా తీసుకుంటున్న వివరాలను సీఎస్ గవర్నర్‌కు వివరించారు.
10:15 PM, 27 Sep
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారుల‌ను ట్రాన్స్ కో శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌ట్ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ర‌ఘుమారెడ్డి ఆదేశించారు.
9:20 PM, 27 Sep
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణకు మంగళవారం(సెప్టెంబర్ 27) భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది.
8:57 PM, 27 Sep
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 58 మిమీ వర్షపాతం నమోదైంది.
8:03 PM, 27 Sep
హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో సోమ,మంగళవారాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
7:53 PM, 27 Sep
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 28,29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి
7:43 PM, 27 Sep
తెలంగాణలో 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది.
7:19 PM, 27 Sep
ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గొట్టా బ్యారేజ్ కింద ప్రవహిస్తున్న వరద నీరు
7:09 PM, 27 Sep
విశాఖపట్నం విమానాశ్రయంలోకి భారీగా చేరిన వర్షపు నీరు
4:59 PM, 27 Sep
హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయం.. భయాందోళనలో హైదరాబాద్ నగరవాసులు
4:58 PM, 27 Sep
హైదరాబాదులో చెరువులను తలపిస్తోన్న రోడ్లు
4:57 PM, 27 Sep
తెలంగాణలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
4:57 PM, 27 Sep
ఇప్పటికే హైఅలర్ట్ జారీ చేసిన జీహెచ్ఎంసీ... అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావొద్దన్న ప్రభుత్వం
4:56 PM, 27 Sep
హైదరాబాదులో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. హైదరాబాదులో కుండపోత వాన. రోడ్లపై లైట్లు వేసుకుని వెళ్తున్న వాహనదారులు.
2:23 PM, 27 Sep
గన్నవరం ఎయిర్‌పోర్టులోకి చేరిన వర్షపు నీరు
2:17 PM, 27 Sep
విజయనగరంలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు. గ్రామాలను ముంచెత్తుతున్న వరద, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
2:16 PM, 27 Sep
విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల లేని కరెంట్
11:44 AM, 27 Sep
నిన్న విశాఖలో చినుకులతో ప్రారంభమై ఈ రోజు గత ఆరుగంటలుగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. మాడుగులలో కొత్త పల్లి వాటర్ ఫాల్స్‌ పొంగి ప్రవహిస్తోంది. మొత్తంగా విశాఖలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
9:49 AM, 27 Sep
గులాబ్ తుఫాను నేపథ్యంలో తమ సర్వీసులపై ఇతరత్రా సేవలపై ఆంక్షలు విధించకుండా సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరిన టెలికాం కంపెనీలు
9:38 AM, 27 Sep
సైక్లోన్ గులాబ్ ఎఫెక్ట్: హైదరాబాద్.. ఉప్పల్,రామంతపూర్, మేడిపల్లి,ఘట్కేసర్ పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం
READ MORE

English summary
Cyclone Gulab will make a landfall in Singupuram of Srikakulam district on Sunday by evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X