తరుముకొస్తున్న జావద్ తుపాను.!ఉత్తరాంధ్రాకు ముప్పు.!అప్రమత్తమైన జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్
శ్రీకాకుళం/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకు పడేందుకు శర వేగంతో ముంచుకొస్తోంది జావద్ తుపాను. జావద్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద యెత్తున ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జేరీ చేసినట్టు తెలుస్తోంది. ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

తరుముకొస్తున్న జావద్..
జావద్ తుఫానుపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యిందని, పోలీస్ అధికారులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమై జావద్ తుఫాన్ తీరం దాటే సమయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనుటకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు గురించి జిల్లా ఎస్పీ కి వివరించారు అధికారులు.

డిజాస్టర్ టీమ్స్ రెడీ..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జల్లాలోని ఇప్పటికీ సుమారు 239 తుపాన్ ప్రభావిత తీరప్రాంత గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులును నియమించడం జరిగిందని తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాకు మూడు చొప్పున జాతీయ విపత్తు ప్రతి స్పందన దళాలతో పాటు, రాష్ట్ర విపత్తు ప్రతి దళాలు చేరుకున్నాయిన్నారు. తుఫాన్ ప్రభావం ద్వారా నేలకొరిగిన వృక్షాలు, చెట్లను సకాలంలో తొలిగించి రహదారి మార్గంలో రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ సిబ్బందిని సన్నద్ధం చేశామని ఎస్పీ తెలిపారు.

ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు..
తుపాను సమయంలో జిల్లా రెవిన్యూ పోలీసు ఇతర విభాగాల యంత్రాంగాలను సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా అన్ని విధాలా సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుఫాను హెచ్చరిక దృష్ట్యా శనివారం భారీ వర్ష సూచన ఉందని, 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో బయట ప్రదేశాల్లో ప్రజలు ఎవరు ఉండకుండదుని ప్రజలకు సూచించారు. వీలైనంత వరకూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం శ్రేయస్కరమి అధికారులు సూచిస్తున్నారు.

అన్ని రెస్య్కూ ఫోర్స్ సిద్దం..
ఇదిలా ఉండగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉండరాదని, తుఫాన్ రక్షిత భవనాలు, పునరావాస కేంద్రాలలో మాత్రమే ఉండాలని కోరారు. అదేవిదంగా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కోరారు.పశు సంపదకు ఎటువంటి హానీ జరగకుండా సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేసామన్నారు ఎస్పీ. భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నందున మడ్డువలస డ్యామ్ లో నీటిమట్టాన్ని కొంతమేరకు తగ్గించడం జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు.