వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివర్ ఎఫెక్ట్ ... తిరుమలలో జోరువాన .. చలిగాలుల తీవ్రతతో భక్తుల ఇబ్బంది

|
Google Oneindia TeluguNews

నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి తమిళనాడు, పుదుచ్చేరి వద్ద తీరం దాటే దిశగా ముందుకు కదులుతున్నట్లు ఐఎండి వెల్లడించింది. తుఫాన్ అంతకంతకు బలపడుతూ ఏపీ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలోనూ, కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుంటే మరోపక్క చిత్తూరు జిల్లాలోనూ నివర్ ప్రభావం కనిపిస్తోంది.

తిరుమలలో కొత్త రూల్.. ఆ వాహనాలతో వెళ్తే అనుమతి లేదుతిరుమలలో కొత్త రూల్.. ఆ వాహనాలతో వెళ్తే అనుమతి లేదు

తెల్లవారుజాము నుండి తిరుమలలో జోరు వాన

తెల్లవారుజాము నుండి తిరుమలలో జోరు వాన

తాజాగా తిరుమలలో ఈరోజు తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తోంది.

నివర్ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అసలే చలి కాలం, ఆపై తుఫాను కారణంగా విపరీతమైన చలి గాలులతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తుఫాను కారణంగా తిరుమల చిగురుటాకులా వణుకుతోంది . ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న భక్తులు వారి గదులకు వెళ్లే లోపే పూర్తిగా తడిసి పోయారు.

 తుఫాను హెచ్చరికలతో అప్రమత్తమైన టీటీడీ

తుఫాను హెచ్చరికలతో అప్రమత్తమైన టీటీడీ

తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తుల రక్షణ కోసం కొండచరియలు విరిగి పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. వర్షం కారణంగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తిరుమలలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది .

చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

నివర్ తుఫాన్ ప్రభావం తమిళనాడు , పుదుచ్చేరిలతో పాటు ఏపీపై చూపిస్తుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క
తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి .విద్యాసంస్థలన్నింటికీ మూడు రోజులు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుంటూ, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.

English summary
It has been raining in Thirumala since early morning today. Devotees who went to visit Thirumala Srivaru were troubled by the heavy rains with gusts of wind affected by the Nivar storm. The actual cold season, and then the extreme cold winds due to the cyclone in the wake of the rain does not seem to be the situation for the devotees to come out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X