వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ-యానాం మధ్య తీరం దాటనున్న తుఫాను: పెనుగాలులు, భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి/కాకినాడ/విశాఖపట్నం: పెథాయ్ తుఫాను కాసేపట్లో కాకినాడ - యానం మధ్య తీరం దాటనుంది. పెథాయ్ తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. చెట్లు నేలకు కూలాయి. విశాఖపట్నం, కాకినాడలలో తుఫాను బీభత్సం బాగా ఉంది. ఈ ప్రభావం మరో రెండు గంటల వరకు ఉండనుంది.

పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి. తుఫాను ప్రభావం కారణంగా కోనసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మూడు అడుగులకు పైగా నీళ్లు రోడ్ల పైనే నిలిచాయి. పెథాయ్ తుఫాను కారణంగా పలు విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. ప్రయాణీకులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్‌లు ఆర్టీజీఎస్‌లో కూర్చొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెథాయ్ తుఫాను పరిస్థితులను ఎప్పటికి అప్పుడు సమీక్షించాలని సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Cyclone Pethai: Andhra Pradesh On High Alert | పెథాయ్‌ ఎఫెక్ట్ తో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం!!
Cyclone Phethai makes a landfall at Katrenikona near Amalapuram

పెథాయ్ తుఫాను మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని 350 గ్రామాలతో పాటు బెంగాల్‌లోని పలు గ్రామాలపై భారీగా ప్రభావం పడనుంది.

English summary
Nearly 350 vulnerable coastal villages of 30 mandals in the north coastal districts of Andhra Pradesh and many districts of South Bengal have been put on high alert by the respective administrations in view of cyclone Phethai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X