శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘టిట్లీ’ తుఫాను తాకిడి నేపథ్యంలో...పర్యవేక్షణ కోసం శ్రీకాకుళంకు సీఎం చంద్రబాబు పయనం

|
Google Oneindia TeluguNews

టిట్లీ తుఫాన్ నేటి ఉదయానికి తీరం దాటుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం చంద్రబాబు ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ...మరోవైపు ఆర్టీజి ద్వారా ఎప్పటికప్పుడు శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారని సమాచారం.

Recommended Video

Cyclone Titli Crossed Shore At Vajrapukotturu In Srikakulam

టిట్లీ తుఫాన్ ఉత్తరాంధ్రలో భీభత్సం నేపథ్యంలో సిఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకృతి విపత్తులు నిలువరించలేకపోయినా...వాటివల్ల తలెత్తే నష్టాన్ని మానవ ప్రయత్నంతో కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని సిఎం చంద్రబాబు అధికారులను అప్రమప్తం చేస్తున్నారు. వాయుగుండం తెల్లవారుజామున తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై సిఎం అధికారులతో సమావేశం నిర్వహించారు. సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Cyclone Titli makes landfall in Andhra’s Srikakulam...CM Chandrababu will visit Srikakulam today

వాయుగుండం గురువారం ఉదయానికి తీరం దాటుతుందన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. ఆర్టీజి ద్వారా శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారు. తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై సిఎం అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఉత్తరాంధ్రలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈదురుగాలుల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తినష్టం కలిగినట్లు సమాచారం అందింన్నారు. పంటనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తెరిపి ఇచ్చిన వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయచర్యలలో చురుగ్గా పాల్గొనాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఇది పెను విపత్తని, తుపాను ప్రభావంతో ఈ జిల్లాకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని సిఎం చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, భారీ ఎత్తున జీడిచెట్లు, కొబ్బరిచెట్లు నేలకూలాయని, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయని సీఎం తెలిపారు. ముందస్తు జాగ్రత్తలపై ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ సందేశాలు పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తుపాన్ తాకిడికి గురైన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ రాత్రి సీఎం బస చేయనున్నారని, సహాయపునరావాస చర్యలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారని సమాచారం.

English summary
Srikakulam:Cyclone Titli makes landfall in Andhra’s Srikakulam, leaves trail of panic and devastation...in this background CM Chandrababu is ready to go to Srikakulam today afternoon to oversee the relief efforts in cyclone affected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X