వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో ఎక్కడా లేదు: సీఎం వైఎస్ జగన్ తీరుపై డీ రాజా విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పర్యటించిన సందర్భంగా ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిశారు. అమరావతి తరలింపు అంశంపై ఆయనకు వివరించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు..

ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు..

ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు జగన్ సర్కారు విలువ ఇవ్వకపోవడం దురదృష్టకరమని రాజా వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకని రాజా ప్రశ్నించారు.

జగన్ సర్కారుకు వినపడటం లేదు...

జగన్ సర్కారుకు వినపడటం లేదు...


ప్రజలతో పోరాడటం కంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని జగన్ సర్కారుకు డీ రాజా హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీల గొంతును ప్రభుత్వం వినాలనీ, అయితే, ఏపీ సర్కారుకు అవేమీ వినపడటం లేదని మండిపడ్డారు.

అమరావతే రాజధాని..

అమరావతే రాజధాని..

మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని రాజా స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలపై దాడులను తమ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు డీ రాజా. రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Recommended Video

AP CM YS Jagan's Mega Check to Pawan Kalyan | Chiranjeevi May Nominated to Rajyasabha || Oneindia
కొనసాగుతున్న అమరావతి ఆందోళనలు..

కొనసాగుతున్న అమరావతి ఆందోళనలు..


మూడు రాజధానులకు వ్యతిరేకమని సీపీఐ ఏపీ సమితి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు నిరసనగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు 66వ రోజుకు చేరాయి. ఇప్పటికే రైతులు, మహిళలు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

English summary
CPI leader d raja slams cm ys jagan for amaravathi issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X