వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెల్లినే నమ్మడు, అహంకారి: జగన్‌పై దాడి, విజయమ్మ ఓటమికి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల వరకు జగన్ జైలులో ఉంటే ఎపిలో గెలిచే వారేమోనన్నారు. జైలులో జగన్ మాటలు విని తాను మోసపోయానని చెప్పారు. తాను జైలులో చూసిన జగన్ వేరే... ఇప్పుడు చూస్తున్న జగన్ వేరే అన్నారు.

తల్లిని, చెల్లిని నమ్మలేదు

జైలులో జగన్ మాట్లాడిందంతా నటన అని, అది ఆయన బయటకు వచ్చాక తనకు తెలిసిందన్నారు. తన చెల్లి, తల్లిని నమ్మని జగన్ ప్రజలను ఎలా నమ్ముతాడని ప్రశ్నించారు. షర్మిల ఎంపీ అయితే ఎక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందోనని జగన్ భయపడ్డారన్నారు. తల్లిని గెలిపించుకునేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. విజయమ్మ గెలుపు కోసం కొడుకుగా ఆయన ఏం చేశాడో చెప్పాలన్నారు.

Dadi controversial comments on YS Jagan

తల్లిని, చెల్లిని చూసినా భయమే

జగన్‌కు తల్లిని చూసినా, చెల్లిని చూసినా భయమే అన్నారు. తల్లిని, చెల్లిని నమ్మని వాడు ప్రజలను ఎలా నమ్ముతాడని ప్రశ్నించారు. జగన్‌ది నియంతృత్వ ధోరణి అని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి ఆయనే కారణమన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పార్టీలో అసలు కమిటీలే లేవన్నారు. అసలు పార్టీకి విధివిధానాలే లేవని ధ్వజమెత్తారు. జగన్ విశ్వరూపాన్ని చూసి ప్రజలు భయపడ్డారన్నారు. జగన్ మారాడాని నమ్మి మోసపాయమన్నారు. జైలు నుండి వచ్చాక నైజం బయటపడిందన్నారు.

నియంత, అహంభావి

జగన్‌కు మానవతా విలువల్లేవని, పార్టీ కోసం పని చేసిన సొంత చెల్లిని పక్కన పెట్టారన్నారు. షర్మిల గెలిస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని జగన్ భయపడ్డారన్నారు. పబ్లిక్ మీటింగు పెడితే రెండు మూడు కోట్లు ఖర్చవుతుందని విశాఖ బీచ్ రోడ్డులో పెట్టాడన్నారు. ఎన్నికల్లో తల్లిని ఓడించడమే జగన్ లక్ష్యంగా కనిపించిందన్నారు. నియంతృత్వం, అహంకారం జగన్ గుణాలు అన్నారు. జగన్ ఓ నియంత అని దుయ్యబట్టారు.

ప్రాంతీయ పార్టీని నడిపించే శక్తి, స్థాయి జగన్‌కు లేదన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డారని ఆరోపించారు. ఈ పార్టీ మనుగడ కష్టమే అన్నారు. ఎన్నికలకు ముందు రైతుల రుణమాఫీ పెడతామని అడుగితే వద్దన్నాడన్నారు. జగన్ గారు ఎవరి సలహాలు వినే పరిస్థితిలో లేరని, ఒకరిని తానేంది సంప్రదించేది అనే అహంభావం ఉంటుందన్నారు. రాజకీయ నాయకుల్లో చర్చించే విధానం ఉండాలని చెప్పారు. అలాంటి విధానం ఆయనలో లేదని, నియంతృత్వమే ఉందన్నారు.

ఉంటే ఉంటారు.. లేకుంటే వెళ్తారు..

జగన్ నియంతృత్వాన్ని అంగీకరించిన వారే పార్టీలో ఉండారని, లేకుంటే వెళ్లిపోతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. ఓటమికి జగన్ కారణమని అందరు అనుకుంటున్నారని చెప్పారు. ఈ పార్టీ అసలు ఉంటుందో లేదో.. ఇంకో పార్టీలో కలిపేస్తారో... ఎవరికీ తెలియదని, అలాంటప్పుడు పార్టీలో ఉన్న వారు ఆలోచించుకోవాలన్నారు.

సీట్లు ఇచ్చేటప్పుడు తన ఇష్టమొచ్చిన వారికిచ్చాడన్నారు. జైలులోని సహచరులకు ఇచ్చాడన్నారు. జగన్ వంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు అభద్రతాభవానికి లోనయ్యే వారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్‌కు తప్ప ఎవరికీ పదవులు అవసరం లేదన్నారు. రాష్ట్రానికి, పార్టీకి జగన్ నాయకత్వం ఉండవద్దన్నారు.

English summary
Dadi Veerabhadra Rao make controversial comments on YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X