వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా తోడ‌ల్లుడు వింత జాతి వ్య‌క్తి : ఇంటిలిజెన్స్ ఐజి ఏం చేస్తున్నారంటే : ద‌గ్గుబాటి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వేంక‌టేశ్వ‌ర రావు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. బుధ‌వారం వైసిపి లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ పైనా ద‌గ్గుబాటి ఫైర్ అయ్యారు.

ఆయ‌న వింత జాతి వ్య‌క్తి..
ద‌గ్గుబాటి వేంక‌టేశ్వ‌ర రావు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. రాజకీయాలంటే గ్లామర్ కాదని.. బాధ్య త అని అన్నారు. ఎన్నికల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. నా తోడల్లుడు(చంద్రబాబు) విం త జాతికి చెందిన వ్యక్తి అని.. ఉదయం ఒకమాట.. సాయంత్రం మరోమాట మాట్లాడే స్వభావం ఆయనదంటూ దగ్గుబాటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించారు, రాజధాని అకృతులు ఎంపిక చేయడానికి నాలుగేళ్లు కావాలా..అని నిలదీశారు. ఇంటిలిజెన్స్ ఐజి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Daggubati serious comments on Chadndra Babu : Joining YCP on 27th this month

రేపు వైసిపి లో చేరిక‌..
బుధ‌వారం వైసిపి లో అధికారికంగా చేరుతున్న‌ట్లు ద‌గ్గుబాటి ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చా రో అదే ఆశయాన్ని తన తల్లిదండ్రులు కూడా కొనసాగించారన్నారు ద‌గ్గుబాటి హితేష్‌. ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని హితేష్ తెలిపారు. తమ కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా పని చేస్తానని తెలిపారు. జగన్‌తో కలిసి నడవడం చాలా సంతోషంగా ఉందని.. జగన్ ప్రజల కోసం పడుతున్న కష్టం చూసి వైసీపీలో చేరుతున్నట్టు హితేష్ తెలిపారు. ఇప్ప‌టికే హితేష్ కు వైసిపి అధినాయ‌క‌త్వం ప‌ర్చూరు టిక్కెట్ ఖ‌రారు చేసింది.

English summary
EX minister Daggubati Venkateswara Rao serious comments on AP CM Chandra Babu. Daggubati says AP Intelligence chief Venkateswara Rao working for ruling party. Daggubati joining in YCP on 27th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X