వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వార్న్: అధిష్టానానికి దగ్గుబాటి షాక్, తిరస్కారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Daggubhati Venkateswara Rao
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో అందరు పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని లేదంటే సస్పెన్షన్ వేటు పడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తన అలకను వీడలేదు. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. మరో పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆయనను కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని మోత్కుపల్లి తిరస్కరించారు.

దగ్గుబాటి తిరస్కరణ ఓటు

కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సతీమణి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు పార్టీ పైన తిరుగుబావుటా ఎగురవేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పార్టీ సూచించినట్లుగా ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. తొలిసారి ప్రవేశ పెట్టిన తిరస్కరణ ఓటును (నోటా)ను ఆయన ఉపయోగించుకున్నారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేదు. దీనిని ఆయన ఉపయోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని అందుకే తాను తిరస్కరణ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణాలు చెప్పాల్సి ఉందన్నారు. విభజనపై రెండో ఎస్సార్సీ వేయాల్సి ఉండెనని భావించారు.

English summary
Congress Party senior MLA Daggubhati Venkateswara Rao on Friday gave shock to Congress Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X